
గతంలో “కబాలి” షూటింగ్ జరుగుతున్న వేళ, ఆరోగ్యం మందగించడంతో అమెరికాకు వెళ్లి, దాదాపు 40 రోజుల పాటు అక్కడే ఉండి ఆరోగ్యం కుదుట పడిన తరువాత, సూపర్ స్టార్ రజనీకాంత్ ఇండియాకు తిరిగొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘రోబో’ సీక్వెల్ పాటల షూటింగ్ లో పాల్గొనేందుకు ఉక్రెయిన్ వెళ్లాల్సిన రజనీ, ఆరోగ్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లారని తెలియడంతో రజనీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
సూపర్ స్టార్ సడన్ గా యూఎస్ పయనం కావడంతో, తమిళ ప్రసార మాధ్యమాల్లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టాకీ పార్టును పూర్తి చేసుకున్న ‘రోబో’ రెండో భాగంలో పాటలు చిత్రీకరణ బ్యాలెన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో లీకై, సూపర్ స్టార్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
రాప్తాడు ఘటన పిల్లలలో, ఆ పిల్లల తల్లితండ్రులలో ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఒక ప్రభుత్వ పాఠశాలలోకి ఒక వ్యక్తి ప్రమాదకరమైన…
మానవసంబంధాల బలహీనత సమాజాన్ని ఎటువైపుకి తీసుకెళుతుంది అనేదానికి నేడు సమాజంలో జరుగుతున్న ఎన్నో దారుణాలు సజీవ సాక్ష్యాలుగా కళ్ళ ముందు…