
శశికళతో పాటు మిగిలిన నిందితులందరూ ట్రయల్ కోర్టు విధించిన నాలుగేళ్ల శిక్ష, 100 కోట్ల జరిమానాను చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తి పినాకి చంద్రఘోష్ తన తీర్పులో పేర్కొన్నారు. కేసులో ఏ-1 ముద్దాయిగా ఉన్న జయలలిత మరణించిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన, మిగతా శశికళ, ఇళవరసి, సుధాకరన్ లు దోషులని, వీరంతా లొంగిపోయేందుకు నాలుగు వారాల గడువిస్తున్నామని తెలిపారు. నాలుగు వారాల్లోగా పోలీసుల ముందు లొంగిపోవాలని ఆదేశించారు.
తాజా పరిణామాలతో ఎమ్మెల్యేలు చేజారకుండా చూడాలని శశికళ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు శశికళ అన్న కుమారుడైన దీపక్ ను ముందు నిలిపి, ఫిరాయించాలని భావించే ఎమ్మెల్యేలను కట్టడి చేయాలని శశికళ యోచిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ విషయంలో ఇప్పటికే ఉప్పందుకున్న పన్నీర్ వర్గం, దీపక్ ను శశి వర్గం తీసుకువస్తే, అందుకు ధీటుగా దీపను రంగంలోకి దించాలని నిర్ణయించింది. ఇప్పటికే దీప నుంచి పన్నీర్ కు సానుకూల సంకేతాలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో జయలలిత రక్త సంబంధీకులను తీసుకువచ్చి పబ్బం గడుపుకోవాలని ఇరు పక్షాలూ ఎత్తుల మీద పైఎత్తులు వేస్తున్నట్టు సమాచారం.
Venkatesh-Trivikram’s Aadarsha Kutumbam has collected approximately Rs. 36 crores gross worldwide in its first two…
పులివెందులలో జరిగిన అల్లర్లు, పోలింగ్ సందర్భంగా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ, వైసీపీ అధినేత జగన్మోహన్…