
గత 5 ఏళ్ళలో అనేక సూపర్ హిట్ సినిమాలు వచ్చి పోయాయి. వాటిని కొత్త సినిమాలు మరిపిస్తున్నాయి. కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన కోడి కత్తి కేసు మాత్రం 5 ఏళ్ళయినా ఇంకా దిగ్విజయంగా కొనసాగుతూనే ఉంది!
ఈ కేసుని దర్యాప్తు చేసిన ఎన్ఐఏ దానిలో ఎటువంటి రాజకీయ కుట్ర లేదని పదేపదే చెప్పినా జగన్మోహన్ రెడ్డి ఆ కేసుని 5 ఏళ్ళు కొనసాగించారు. కానీ జగన్ ఏనాడూ విచారణకు హాజరు కాకుండా, నిందితుడు శ్రీనును జైల్లోని బయటకు రాకుండా చేశారు. చివరికి ఈ ఏడాది ఫిబ్రవరిలో హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో శ్రీను బయటకు రాగలిగాడు.
ఈ కేసులో కొత్త ట్విస్ట్ ఏమిటంటే, నిందితుడు శ్రీను బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎన్ఐఏ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. కానీ సుప్రీంకోర్టు శ్రీను బెయిల్ రద్దు చేయలేమని స్పష్టం చేసింది. అది వేరే విషయం.
ఈ కేసులో శ్రీనుని విచారించాల్సినది ఏదీ లేదని వాదించిన ఎన్ఐఏ, అతని బెయిల్ రద్దు చేయమని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడమే ఆలోచింపజేస్తుంది. దీని వెనుక రాజకీయ కోణం కూడా ఏమైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎందువల్ల అంటే, ఈ కేసు విచారణ పూర్తవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి కూడా కోర్టులో విచారణకు హాజరుకావాలని ఎన్ఐఏ పదేపదే కోరింది. కానీ ఇంతకాలం జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నందున తీరిక లేక విచారణకు హాజరు కాలేకపోతున్నారని చెప్పుకునేవారు.
ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి ఊడిపోయింది. కనీసం క్యాబినెట్ హోదా కలిగిన ప్రధాన ప్రతిపక్ష నేత కూడా కాదు. కేవలం వైసీపి ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు.
కనుక ఆయనను కోర్టుకు రప్పించేందుకే కోడి కత్తి శ్రీనుని మళ్ళీ జైలుకి పంపించి విచారణ కొనసాగించాలని ఎన్ఐఏ అనుకుంటోందా?లేదా మరేదైనా బలమైన కారణం ఉందా?అనే విషయం త్వరలో తెలుస్తుంది.
ఇదివరకు జగన్ తన పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ కేసును వాడుకోవడం ఆశ్చర్యం కాదు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ కేసును ఏళ్ళ తరబడి కొనసాగిస్తూ దాంతో టిడిపిని మరోసారి రాజకీయంగా దెబ్బతీయాలనుకోవడమే బెడిసికొట్టింది. అప్పుడు ఆయన ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉండాలని కోరుకోగా, ఇప్పుడు ఎన్ఐఏ ఆయన ముచ్చటని తీర్చబోతోంది!
ఇప్పుడు జగన్ కేవలం ఎమ్మెల్యే మాత్రమే కనుక ఈ కేసు విచారణ మళ్ళీ మొదలైతే తప్పనిసరిగా కోర్టుకి హాజరు కావలసి ఉంటుంది. ఎన్నికలలో ఘోర పరాజయంతో తలెత్తుకోలేక ప్రజల మద్యకు రాలేకపోతున్న జగన్, ఇప్పుడు ఈ కేసు విచారణకు కోర్టుకి స్వయంగా హాజరవ్వాల్సి వస్తే నవ్వులపాలవడం ఖాయం. ఎన్ఐఏ ఏ ఉద్దేశ్యంతో కోడి కత్తి శ్రీను బెయిల్ రద్దు చేయాలని కోరినా చివరికి జరిగేది మాత్రం ఇదే!
జాబ్ నోటిఫికేషన్స్ గురించి ఎదురుచూస్తున్న రాష్ట్రంలో యువతకు వాటి గురించి పూర్తి స్పష్టత ఉంది. కానీ ఐదేళ్ళు సిఎంగా రాష్ట్రాన్ని…
Director Rahul Sankrityan had some big words for Rashmika Mandanna at the Ranabaali pre-release event.…