
తిరుమల ప్రసాదానికి వాడే నెయ్యి కల్తీ వ్యవహారం సుప్రీంకోర్టుకి చేరడం ఈ అంశంపై సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కెవి విశ్వనాధన్‌లు చేసిన వ్యాఖ్యలు, వాటికి టీటీడీ తరపున వాదించిన సిద్ధార్థ్ లుద్రా చెప్పిన సమాధానాలు ఆసక్తికరంగా ఉన్నాయి. క్లుప్తంగా ఆ వివరాలు…
జస్టిస్ బీఆర్ గవాయి: తిరుమలకి సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిన్నట్లు టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఏమైనా ఆధారాలున్నాయా?లేనప్పుడు ముఖ్యమంత్రి ఈ విషయం గురించి మీడియాతో మాట్లాడాల్సిన అవసరం ఏమిటి?
జస్టిస్ కెవి విశ్వనాధన్: ఎన్‌డీడీబీ నివేదిక జూలైలో వస్తే, సెప్టెంబర్ 18న ముఖ్యమంత్రి సిట్ దర్యాప్తుకి ఆదేశించారు. సిట్ దర్యాప్తుకి ఆదేశించారంటే బలమైన ఆధారాలు ఏవీ లేవని నిర్ధారణ అవుతోంది. ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని తెలిస్తే దేశంలో కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బ తింటాయి. కనుక ఈ విషయం గురించి ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడటాన్ని ఏవిదంగా సమర్ధించుకోగలరు? నెయ్యి కల్తీ జరిగిందని అనుమానం వచ్చినప్పుడు మరోసారి పరీక్షలు చేయించి నిర్ధారించుకోవాలని అనిపించలేదా? ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడిన్నట్లు మేము భావించడం లేదు.
టీటీడీ న్యాయవాది సిద్ధార్థ్ లుద్రా: ప్రసాదం నాణ్యతపై భక్తుల నుంచి పిర్యాదులు వస్తుండటంతో అనుమానం వచ్చి నెయ్యిని గుజరాత్‌లోని ఎన్‌డీడీబీ ల్యాబ్‌కు పంపాము. దేశంలో కేంద్ర ప్రభుత్వం అధ్వర్యంలో నడిచే అత్యంత ప్రామాణికమైన సంస్థ అది.
జూన్, జూలై నెలల్లో తిరుమలకి నెయ్యి రాగా వాటిలో జూలై 6,12 తేదీలలో వచ్చిన నేతి నాణ్యతపై అనుమానం కలగడంతో దానిని ప్రసాదంలో వినియోగించలేదు. కానీ అంతకు ముందు అదే కంపెనీ సరఫరా చేసిన నేతిని ప్రసాదంలో వినియోగించారు. ఎన్‌డీడీబీ నివేదికలో నెయ్యిలో కల్తీ జరిగిందని స్పష్టం పేర్కొంది.
ఆ విషయం నిర్ధారించుకున్నాకే జూలై 23న నెయ్యి సరఫరా చేస్తున్న సంస్థకి షోకాజ్ నోటీస్ జారీ చేయగా వారు సెప్టెంబర్ 4న సమాధానం ఇచ్చారు.
అప్పుడే ఈ విషయం అందరికీ తెలియడంతో ఇంకా దీనిపై ప్రభుత్వం గోప్యత పాటిస్తే ప్రజలు ప్రభుత్వాన్ని అనుమానిస్తారు. అపోహలు మొదలవుతాయి. అందుకే ముఖ్యమంత్రి ప్రకటన చేయవలసి వచ్చింది. నెయ్యిలో కల్తీ జరిగిందని ఎన్‌డీడీబీ నివేదికలో స్పష్టంగా పేర్కొంది గనుకనే చట్ట ప్రకారం సిట్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.
ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు పిటిషనర్ల అభ్యర్ధన మేరకు సీబీఐ లేదా మరో స్వతంత్ర సంస్థ చేత విచారణ జరిపించాలా లేదా సిట్ చేత దర్యాప్తు జరిపిస్తే సరిపోతుందా? తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…
An Indian F-1 student finds herself in serious trouble. A misunderstanding at Walmart has left…