
రిజర్వేషన్లు….అనే ఈ ఒక్క పదం ఎంతోమంది జీవితాలను తలకిందులు చేస్తుందంటే ఆతిశయోక్తి కాదేమో. ఈ రిజర్వేషన్లు కింద ఉన్నవాడిని పైకి తీసుకెళ్లగలవు, అలాగే పైన ఉన్నవాడిని కిందకు లాగనుగలవు. అయితే ఈ రిజర్వేషన్ల వల్ల లబ్ది పొందే కుటుంబాలు ఎన్ని ఉంటాయో అలాగే వాటి ఫలితంగా నష్టపోయే కుటుంబాల సంఖ్య కూడా అంతే ఉంటుంది.
రిజర్వేషన్లు అనేది ప్రయోజనం పొందే వారి కుటుంబాల కంటే కూడా ఆ అవకాశం పొందలేని వారికే వాటి విలువ ఎక్కువగా తెలుస్తుంది. ఈ రిజర్వేషన్ల అమలు వల్ల కలిగే సమస్యలు ముఖ్యంగా విద్యార్థులకు, ఉద్యోగులకు ఎక్కువగా తెలుస్తుంటాయి. అయితే ఈ అంశం అత్యంత సున్నితమైన అంశం కావడం, రాజకీయ నాయకుల గెలుపోటములను ప్రభావితం చేసే అంశం కావడంతో రాజకీయ పార్టీలు కానీ ఆ పార్టీల నేతలు కానీ దీని పై స్పందించేందుకు సాహసించరు.
అయితే రిజర్వేషన్లు పూర్తిగా తొలగించాలి అని ఎవరు వాదించడం లేదు కానీ ఉన్నత వర్గంలో కూడా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు ఏ స్థాయిలో ఉంటాయో అలాగే వెనుకబడిన వర్గం వారిలో కూడా ఉన్నత స్థాయిలో ఎదిగిన కుటుంబాలు కూడా అంతే మోతాదులో ఉంటాయి. అటువంటి వారి విషయంలోనే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా పునరాలోచన చెయ్యాలంటూ వ్యాఖ్యానిస్తుంది.
అయితే ఇప్పుడు ఈ రిజర్వేషన్ల అంశంలో సుప్రీం కోర్ట్ చేసిన కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు….వెనుకబడిన తరగతుల వారు రిజర్వేషన్ల ప్రయోజనాలు అందుకుని ఉన్నత స్థాయిలోకి ఎదిగిన తరువాత కూడా వారి కుటుంబాలకు ఇంకా రిజర్వేషన్ల వెసులుబాటు ఎందుకు.? అంటూ ప్రశ్నించింది.
అలాగే తల్లితండ్రులు ఐఏఎస్ అధికారులు అయినప్పుడు వారి పిల్లలకు ఇంకా రిజర్వేషన్లు అవసరమా.? సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందిన కుటుంబాల పిల్లలకు రిజర్వేషన్ల అవసరం ఏముంటుంది.? రిజర్వేషన్ల ప్రయోజనాలు పొంది తల్లితండ్రులు ఉన్నత స్థాయికి చేరిన తరువాత కూడా వారి పిల్లలకు అదే రిజర్వేషన్లు అమలు కావాలని ఆశించడం ఏంటంటూ సుప్రీం సంచలనమైన వ్యాఖ్యలు చేసింది.
రిజర్వేషన్ల ఫలితం పొంది సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా ఒక తరం ఎదిగిన కుటుంబాలకు మరో తరం కోసం ఇంకా రిజర్వేషన్ల ప్రయోజనాలు అవసరమా.? అలాంటి రిజర్వేషన్ల పై కచ్చితంగా సమాజంలో సమీక్ష జరగాలని, నిజానికి అటువంటి కుటుంబాల వారు రిజర్వేషన్ల పరిధి నుంచి బయటకురావాలంటూ సుప్రీం కోర్ట్ కీలక సూచనలు చేసింది.
అయితే సుప్రీం కోర్ట్ వేసిన ఈ ప్రశ్నల మీద, సూచనల మీద రాజకీయాలకు అతీతంగా దేశ వ్యాప్తంగా విస్తృత చర్చ జరగాలి, సమాజంలో అసమానతలు రూపుమాపడానికి, అందరికి సమాన అవకాశాలు అందడానికి సుప్రీం చేసిన ఈ వ్యాఖ్యలు అత్యంత కీలకంగా ఉన్నాయి.
ఇలా ఒకే వర్గానికి చెందిన కుటుంబాలు తరాలు తరబడి రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందుతూ, ఆసిస్తూ ముందుకెళితే ఈ వ్యవస్థ నుంచి మనం ఎప్పటికి బయటపడలేం అన్న సుప్రీం ఆదేశాలు ఏమేరకు ప్రజలను, ప్రభుత్వాలను ప్రభావితం చెయ్యగలవో చూడాలి.
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…
Dulquer Salmaan's I'm Game directed by Nahas Hidhayath, is all set to hit the screens…