సేవియర్ సూర్యకి ఇన్ని సినిమా కష్టాలా?

Suriya’s Karuppu faces release issues and cancelled premieres before theatrical release

తమిళ నటుడు సూర్యని ముద్దుగా సేవియర్ సూర్య అని పిలుస్తూ ఉంటారు సినిమా అభిమానులు. ఎందుకంటే.. ప్రతి సినిమాలో సూర్య ఒక ఊరినో, దేశాన్నో లేక వేలమంది జనాలనో కాపాడడమే ధ్యేయంగా ఉంటాడు కాబట్టి. తమిళంతోపాటు, తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న అతికొద్ది కథానాయకుల్లో సూర్య ఒకడు. ఒకానొక సమయంలో సూర్య సినిమా రిలీజ్ అవుతుందంటే.. మన తెలుగు హీరోలు వాళ్ల స్ట్రయిట్ సినిమాలు పోస్ట్ పోన్ చేసుకున్న సందర్భాలు కోకొల్లలు.

అలాంటి సూర్య ఈమధ్యకాలంలో సరైన థియేట్రికల్ హిట్ లేక వెనుకబడ్డాడు. సూర్యకి ఒక హిట్ పడి పుష్కరం అవుతోంది. వరుస ఫ్లాపులు సరిపోవన్నట్లు.. సూర్య రీసెంట్ సినిమాలన్నీ వాయిదాపడడం కామన్ అయిపోయింది. సూర్య లాస్ట్ హిట్ సినిమా “సింగం 2” కూడా చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఫేస్ చేసి.. ఉదయం రిలీజ్ అవ్వాల్సిన సినిమా మధ్యాహ్నానికి మొదటి షో పడింది. ఇక “కంగువ” ఎన్నిసార్లు పోస్ట్ పోన్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

ADVERTISEMENT

ఇప్పుడు సూర్య తాజా చిత్రం “కరుప్పు” కూడా ఇదే తరహా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తెలుగులో “వీరభద్రుడు”గా రిలీజ్ అవుతున్న ఈ చిత్రం మార్నింగ్ షోస్ మరియు ఫారిన్ కంట్రీస్ లో ప్రీమియర్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఆఖరికి తమిళనాట స్పెషల్ జీవో తెచ్చుకున్న ఉదయం ఆట కూడా క్యాన్సిల్ అయ్యింది. తెలుగులోనూ ఉదయం ఆట మొదలవుతుందో లేదో క్లారిటీ లేదు. మాస్ హీరోగా మంచి ఇమేజ్ ఉన్న సూర్య సినిమాకి ఇలాంటి ఇబ్బందులు ఎదురవ్వడం, అది కూడా తన స్వంత మనుషుల బ్యానర్స్ అయిన స్టూడియో గ్రీన్ & డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థల్లో చేసిన సినిమాలకి ఇలా అవ్వడం బాధాకరం.

ఇప్పుడు సూర్యకి ఒక కమ్ బ్యాక్ ఇవ్వాల్సిన బాధ్యత వెంకీ అట్లూరి మీద పడింది. “విశ్వనాథ్ & సన్స్” మీద ప్రెజర్ కూడా పెరిగింది. మరి వెంకీ ఈ ప్రెజర్ ను ఎలా బ్యాలెన్స్ చేస్తాడో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories