ఆ హీరో ‘డొనేషన్’ ఇదే!

 Swathimuthyam Hero Bellamkonda Ganesh coming with a different pointఈ దసరాకి మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున సినిమాలు రిలీజ్ అవుతున్న అక్టోబర్ 5వ తేదీన ఒక నూతన నటుడు ధైర్యంగా తన సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. అతనెవరోకాదు నిర్మాత బెల్లంకొండ సురేష్ చిన్న కొడుకు, హీరో బెల్లం కొండ శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్. బెల్లంకొండ గణేష్ తన తొలి సినిమాకి యాక్షన్ సినిమాని ఎన్నుకోకుండా, వైవిధ్యం తో కూడిన ఒక ఫామిలీ సబ్జెక్టు ని ఎన్నుకోవడం విశేషం. ఆ సినిమా పేరే స్వాతి ముత్యం . లక్ష్మణ్ కే కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మధ్యే థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

స్వాతి ముత్యం సినిమా ట్రైలర్ చూడటానికి ఒక ఫామిలీ సినిమా లా కనిపించినా, సినిమాలో అంతర్లీనంగా సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారని టాక్. ఇందులో గణేష్ వీర్యాన్ని దానం చేసే యువకుడి పాత్రలో నటిస్తుండటం విశేషం. ట్రైలర్ చివర్లో మునులు ఋషులు లా ఫీల్ అవుతున్నారు అనే డైలాగ్ గణేష్ పాత్ర వీర్యదానం చేస్తుందని చెప్పడానికి హింట్. సితార ఎంటర్టైన్మెంట్స్ పై సూర్య దేవర నాగ వంశి నిర్మిస్తున్న ఈ సినిమాకి, మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories