చివరి నిముషంలో రెండు ప్రభుత్వాల నుండీ సైరా టీంకు గుడ్ న్యూస్

Sye-Raa-Press-Show-in-Media-Costly-Mistakeమరి కొన్ని గంటలలో మెగాస్టార్ చిరంజీవి మొదటి హిస్టారికల్ సినిమా, సైరా అమెరికా ప్రీమియర్లు మొదలు కాబోతున్నాయి. ఈ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మెగా ఫ్యాన్స్ నిముషాలు లెక్కెట్టడం మొదలు పెట్టారు. అయితే ఈ మధ్య కాలంలో ఏ పెద్ద సినిమాకు లేనట్టుగా ఈ సినిమాకు చివరి నిముషం వరకూ స్పెషల్ షోస్ పర్మిషన్ రాలేదు.

దానితో ఈ సినిమా మీద భారీగా పెట్టుబడి పెట్టిన బయర్లు, అన్ని రెకార్డులను కొల్లగొడుతుంది అని ఆశలు పెట్టుకున్న అభిమానులు ఫుల్ గా టెన్షన్ పడ్డారు. అయితే చివరి నిముషంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దీనికి కావాల్సిన స్పెషల్ షోస్ పర్మిషన్ వచ్చింది. తెలంగాణాలో రోజుకు ఐదు షోలు, ఆంధ్రప్రదేశ్ లో ఆరు షోలకు పర్మిషన్ ఇచ్చారు.

ADVERTISEMENT

దీనితో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. సినిమాకు ఉన్న క్రేజ్ ను వాడుకుని ఎక్సట్రా షోలతో భారీ ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం కలిగింది. సైరా 200 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. అన్ని భాషలలో కలిపి 200 కోట్లు షేర్ రాబడితేనే సినిమా హిట్ గా పరిగణించవచ్చు. ఇందులో అగ్రభాగం తెలుగు నుండే రావాలి.

చిరంజీవి కమ్ బ్యాక్ చేసిన ఖైదీ నెంబర్ 150 సినిమా అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లు రాబట్టింది. ఇప్పుడు దానికి రెండింతలు రాబట్టాల్సి ఉంది. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కథతో సినిమా చెయ్యాలని చిరంజీవి ఎప్పటి నుండో అనుకుంటున్నారు ఆ కోరిక ఇప్పటికి తీరింది. మరి ఆ కల కాసులు కూడా రాబడుతుందేమో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories