ప్రభుత్వంలో కదలిక తెచ్చిన మెగాస్టార్ చిత్రం

Sye Raa Narasimha Reddy Movie Censor Reportమెగాస్టార్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సైరా’ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నాలుగు భాషల్లో ఒకేరోజు విడుదల కాబోతుంది. దేశంలోనే బ్రిటీష్ పై పోరాటం చేసిన మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ.

అయితే ఇప్పటివరకు ఆయనకు ప్రభుత్వం ఎటువంటి గుర్తింపునివ్వలేదు. సైరా చిత్రం విడుదల అవుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. చరిత్ర మరిచిన స్వాతంత్ర సమర యోధుడైన నరసింహారెడ్డి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్ణయించుకొందని సమాచారం.

ADVERTISEMENT

దీనిపై త్వరలోనే అధికారిక నిర్ణయం తీసుకోవడంతో పాటు, తగు చర్యలు చేపట్టే దిశలో ఏపీ గవర్నమెంట్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే గనుక కార్యరూపం దలిస్తే సైరా టీం పెద్ద విజయం పొందినట్టే. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రను సినిమాగా తీయాలని చిరంజీవి చాలా సంవత్సరాలుగా అనుకుంటున్నారు. అది ఇప్పటికి కుదిరింది.

చిరంజీవి కెరీర్ లో మొట్టమొదటి హిస్టారికల్ సినిమా ఇదే. పైగా ఈ సినిమాకు రామ్ చరణే నిర్మాత. దాదాపుగా 200 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టారు. త్వరలోనే చిరంజీవి దేశవ్యాప్తంగా తిరిగి సినిమాను ప్రమోట్ చేస్తారని సమాచారం. దీనికోసం విస్తృత ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నారని సమాచారం.

ADVERTISEMENT
Latest Stories