సినిమా గమనం గురించి చిరంజీవి, బిగ్ బీ డిస్కషన్

Sye-Raa-Narasimha-Reddy-team planning for chat show with chiranjeevi Amitabh Bachchan మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాను సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే నెల 2న విడుదలకు సిద్ధం అవుతుంది.

తెలుగు, తమిళ, హిందీ, మరియు మలయాళ భాషలలో ఒకేసారి విడుదల అయ్యే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఒక ఇంట్రెస్టింగ్ చాట్ షో షూట్ చేస్తున్నారట. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, మెగాస్టార్ చిరంజీవి తమ కేరీర్ అనుభవాల గురించి, చిత్ర సీమ గమనం గురించి భోజనం చేస్తూ మాట్లాడుకుంటారట.

ADVERTISEMENT

సైరా హిందీ హక్కులు చేజిక్కించుకున్న ఫర్హాన్ అక్తర్ ఈ షోకి మోడరేటర్ గా వ్యవహరిస్తారంట. ఇండియన్ సినిమాకి చెందిన ఇద్దరు లెజెండ్స్ సినిమా గురించి మాట్లాడుకుంటే అది చాలా అపురూపంగా ఉంటుంది. దీనితో ఈ షో కోసం అంతా ఆసక్తికరంగా వేచి చూస్తున్నారు. త్వరలో దీనిని సోషల్ మీడియాలో విడుదల చేసే అవకాశం ఉంది.

ఇప్పటివరకూ అమితాబ్ ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొనలేదు. చిత్రబృందం ముంబై లో ట్రైలర్ విడుదల చేసినా ఆ కార్యక్రమానికి ఆయన హాజరు కాలేదు. దానితో ఈ షో కీలకం కాబోతుంది. ఈ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువైన గోసాయి వెంకన్నపాత్రలో నటించారు.

ADVERTISEMENT
Latest Stories