“సైరా”లో నేనూ చేస్తున్నానొచ్!

Chiranjeevi Helping Mega Daughter Niharika Konidelaమెగా కాంపౌండ్ నుండి హీరోలే కాదు, హీరోయిన్లు కూడా ఎంట్రీ ఇస్తారని నిరూపించిన నిహారిక, ప్రస్తుతం “హ్యాపీ వెడ్డింగ్” సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ శనివారం నాడు ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ సినిమా గురించి తెలుపుతూ… ఇందులో విలన్ క్యారెక్టర్ ఎవరైనా ఉంటే అది తానేనని, తన క్యారెక్టర్ వలనే సినిమా మలుపులు తిరుగుతూ ఉంటుందని, ఫ్యాషన్ డిజైనర్ గా అక్షర అనే పాత్రలో నటిస్తున్నానని తెలిపింది.

తన క్యారెక్టర్ బాగుంటే హీరో, ఇతర క్యారెక్టర్లు ఎవరని తాను ఆలోచించనని, అలాంటి నేను డాడీ (చిరంజీవి) చేస్తోన్న సినిమా “సైరా”లో అన్నయ్యని అడుక్కుని మరీ నటిస్తున్నానని స్పష్టం చేసింది. ప్రొడ్యూసర్ గా తాను నిన్ను తీసుకోలేనని చెప్తుండగా, సురేందర్ రెడ్డి గారు తనను ఓకే చేసారని, ఓ గిరిజన యువతిగా కనిపిస్తానని, ఓ రెండు, మూడు డైలాగ్ లు కూడా ఉంటాయని మాంచి హుషారుతో చెప్పుకొచ్చింది నిహారిక.

ADVERTISEMENT

[m9adh]

ADVERTISEMENT
Latest Stories