
దివంగత ముఖ్యమంత్రి జయలలిత పలు సందర్భంగాల్లో ‘మక్కళాల్ నాన్..మక్కళుక్కాగవే నాన్’ అని చెప్పేవారని గుర్తుచేశారు. అంటే తనకు ఎవరితోనూ ఎలాంటి బంధాలు లేవని దానర్థమని… అటువంటప్పుడు జయతో శశికళకు ఎటువంటి సంబంధముందని ప్రశ్నించారు. ఏ హక్కుతో ఆమె పోయెస్ గార్డెన్‌లో ఉంటున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని, జయలలిత తర్వాత అంతటి అర్హత ఉన్న వారే సీఎం బాధ్యతలు చేపట్టే హక్కు ఉంటుందని రాజేందర్ అన్నారు.
ఇదిలా ఉంటే… శశికళ సిఎం కావడానికి మార్గం సుగమం చేసిన పన్నీర్ సెల్వానికి కీలక పదవి ఇవ్వాలని శశికళ భావిస్తుండగా, పన్నీర్ మాత్రం తనకు ఎటువంటి పదవులు వద్దని చెబుతున్నట్టు సమాచారం. పదవిపై విముఖత చూపుతున్న ఆయనకు నచ్చజెప్పేందుకు శశికళ సీనియర్లను రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసిన పన్నీర్ సెల్వాన్ని తొలుత స్పీకర్ పదవిలో నియమించాలని శశికళ భావించారు. అయితే పాలనపై పట్టున్న ఆయనకు ముఖ్యమంత్రి లేదంటే ఆర్థిక, హోం శాఖల్లో ఏదో ఒకటి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే అసలు తనకు పదవే వద్దని పన్నీర్ భీష్మించుకుని కూర్చున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…