Telugu

బ్యాన్ విధించేందుకు చట్టాలు…సవాల్ అంటున్న తలసాని.

తెలంగాణ రాజకీయాలు పూర్తిగా పవన్ చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. రాజకీయ విశ్లేషకుడితో మొదలైన ఈ వివాదాస్పద కథ ఆ తరువాత జర్నలిస్ట్, కాంగ్రెస్, బిఆర్ఎస్, తెరాస అంటూ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రాంతీయవాద ముసుగులో తన పై, తన పార్టీ పై జరుగుతున్న రాజకీయం పై పవన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు తెలంగాణ రాజకీయ పార్టీలు పోటీపడి మరి మీడియా ముందుకు క్యూలు కడుతున్నాయి.

ADVERTISEMENT

ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తూ తమ పార్టీ నేతల పై పవన్ చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సహించబోమని, తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి భంగం కలిగేలా వ్యవహరించే వారిని ఏమాత్రం ఉపేక్షించమంటూ పవన్ పై విరుచుకుపడ్డారు.

అలాగే పవన్ చేసిన ఏపీ కాంట్రాక్టుల అంశం మీద కూడా చాల ఘాటైన కామెంట్స్ చేసారు. తెలంగాణలో ఏపీ కాంటాక్టర్లు పనిచేస్తున్నారు, అలాగే ఏపీలో తెలంగాణ కాంట్రాకర్లు పనిచేస్తున్నారు, వారికీ లేని ఈ నిబంధనలు పవన్ కు ఎందుకు అంటూ పవన్ వేసిన ప్రశ్నకు బదులుగా ఇక నుంచి ఏపీ కాంట్రాక్టర్లకు తెలంణగాలో ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వమని,

అవసరమైతే అందుకు కోసం చట్టాలు కూడా సిద్ధం చేస్తామంటూ ప్రకటించారు మంత్రి. దీనితో మంత్రి కోమటిరెడ్డి తన వ్యాఖ్యలకు కట్టుబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఒప్పించి తెలంగాణలో ఏపీ కాంట్రాక్టుల పై బ్యాన్ విధిస్తే నేను రాజీనామా చేస్తా, దమ్ముంటే ఇచ్చిన ప్రకటనకు కట్టుబడి ముందుకు రావాలంటూ బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి కోమటరెడ్డి కి సవాల్ విసిరారు.

అసలు ఒక రాష్ట్రంలో కాంట్రాక్టర్ ల పట్ల మరో రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్ విధించాలని అనుకోవడం, అందుకోసం చట్ట సభలలో చట్టాలు చేస్తాం అంటూ ప్రకటించడం సాధ్యమా.? మంత్రులుగా ఉన్న నేతలు చెయ్యాల్సిన ప్రకటనలేనా ఇవి.? ఇప్పటి వరకు రాజకీయ పార్టీలను ఆయా పార్టీల నేతలను టార్గెట్ చేస్తున్న తెలంగాణ ప్రాంతీయవాదం కాంగ్రెస్ చేతులో మరికాస్త ముదిరి వ్యాపారవేత్తల వరకు విస్తరిస్తుందా.?

కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఈ అనాలోచిత ప్రకటనలు, ఎమ్మెల్యే లు, మంత్రులుగా ఉన్న నాయకులు చేస్తున్న ఈ రెచ్చకొట్టే లాంటి వ్యాఖ్యలు తిరిగి విభజన నాటి విద్వేష మంటలను తిరిగి సృష్టించనున్నాయా.? ఆ మంటలు కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రభావము చూపే అవకాశం ఉండదా.?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ ఇప్పటికైనా తన పార్టీ నేతలు, మంత్రులు చేస్తున్న ఈ వివాదాస్పద ప్రకటనలకు అడ్డుకట్టవేయాలి. లేకుంటే కాంగ్రెస్ కూడా నేటి బిఆర్ఎస్ పరిస్థితులను ఎదుర్కోకతప్పదు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

AK47: Trivikram & Naga Vamsi Fumble Golden Dasara Window

Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…

6 hours ago

New Passport Rules for Minors NRI Parents Must Know

The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…

6 hours ago