నయనతార కంటే తమన్నా మెరుగనిపించింది

Tamannaah Bhatia Sye Raa Narasimha Reddy promotionsమెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాను సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే నెల 2న విడుదలకు సిద్ధం అవుతుంది.

ADVERTISEMENT

తెలుగు, తమిళ, హిందీ, మలయాళీ భాషలలో ఒకేసారి విడుదల అవుతుంది. అన్ని రాష్ట్రాలలో సినిమా ప్రమోషన్స్ చేస్తుంది చిత్రబృందం. నిన్న చెన్నైలో సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టారు. దానికి చిరంజీవి, రామ్ చరణ్, దర్శకుడు, తమన్నా వచ్చారు. తమిళ్ లో స్టార్ హీరోయిన్ అయిన నయనతార మిస్ కొట్టడం విశేషం. సహజంగా నయనతార తన సినిమాల ప్రమోషన్స్ కి రాదు.

అయితే తమిళనాడులో జరిగిన ప్రెస్ మీట్ కన్నా రావాల్సింది. పైగా ఇది ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడి సినిమా. మరోవైపు తమన్నా ఈ సినిమా ప్రమోషన్స్ కు అన్ని విధాలా సహకరిస్తుంది. ఎక్కడకి అంటే అక్కడకు వస్తుంది. ముంబై, చెన్నై లలో కూడా సినిమాను ప్రమోట్ చేసింది. మొత్తానికి నయనతార కంటే తమన్నా మెరుగనిపించింది.

ఈ సినిమాలో తమన్నా లక్ష్మి అనే చిన్న పాత్ర చేస్తుంది. నయనతార ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి సతీమణి సిద్దమ్మగా కనిపిస్తుంది. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల మధ్యకు వస్తున్న ఈ సినిమా అన్ని భాషలలో కలిపి 200 కోట్ల షేర్ రాబడితేనే హిట్ అనిపించుకోగలదు.

ADVERTISEMENT
Latest Stories