
వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి వరుసపెట్టి పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్చార్జిలను మార్చేస్తూనే ఉన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం రాత్రి నాలుగో జాబితా విడుదల చేశారు. దీనిలో హోం మంత్రి తానేటి వనితతో సహా తొమ్మిది మంది నియోజకవర్గాలు మార్చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యేగా ఉన్న హోం మంత్రి తానేటి వనితను గోపాలాపురం నియోజకవర్గానికి మార్చారు.
గోపాలాపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు నియోజకవర్గంలో టిడిపిని బలంగా ఎదుర్కోలేకపోతున్నారని జగన్ భావించడంతో, తానేటి వనితను అక్కడకు పంపించి ఆయనను కొవ్వూరుకి మార్చారు.
తానేటి వనిత గోపాలపురంలోనే పుట్టి పెరిగారు. ఆమె తండ్రి జొన్నకోటి బాబాజీరావు మాజీ ఎమ్మెల్యే. ఆమె 2009లో గోపాలాపురం నుంచే టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచారు. కనుక ఆమెకు ఆ నియోజకవర్గంపై మంచి పట్టుంది.
నాలుగో జాబితాలో శాసనసభ నియోజకవర్గాలకు వైసీపి ఇన్చార్జిలు వీరే:
గోపాలాపురం: తానేటి వనిత (హోం మంత్రి)
కొవ్వూరు: (ఎస్సీ) : తలారి వెంకట్రావు
శింగనమల (ఎస్సీ) : ఎం. వీరాంజనేయులు
మడకశిర (ఎస్సీ) : ఈర లక్కప్ప
కనిగిరి (ఎస్సీ) : దద్దాల్ నారాయణ మాదవ్
నందికొట్కూరు (ఎస్సీ) : సుధీర్ దార
తిరువూరు (ఎస్సీ) : నల్లగట్ల స్వామిదాసు
జీడి నెల్లూరు (ఎస్సీ) : ఎన్. రెడెప్ప
చిత్తూరు లోక్సభ నియోజకవర్గం (ఎస్సీ) : కే. నారాయణ స్వామి.
ఢిల్లీలో సీజేపీ ఆందోళనలకు సోషల్ మీడియా ద్వారా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. అందుకు సీజేపీ నేతలు…
Prithvi Shaw has opened up about dealing with social media backlash, mistakes from his past…