Telugu

జగన్‌ కాదు.. చంద్రశేఖరన్ ఏం చెప్పారో వినండి వైసీపీలు

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టి కలిగిన నాయకుడని జగన్‌, కేసీఆర్‌ వంటివాళ్ళు ఒప్పుకోకపోవచ్చు కానీ ఐటి కంపెనీల ఉద్యోగులు, ఆ రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగినవారు మనస్పూర్తిగా ఒప్పుకుని సమయం సందర్భం వచ్చినప్పుడు చెపుతుంటారు కూడా.

ఢిల్లీలో నిన్న జరిగిన సీఐఐ సదస్సులో టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌ చంద్రశేఖరన్ కూడా సిఎం చంద్రబాబు నాయుడు చాలా దూరదృష్టి కలిగిన నాయకుడని, 25 ఏళ్ళ క్రితం ఐటి రంగం దేశానికి పరిచయమవుతున్నప్పుడే చంద్రబాబు నాయుడు దానికి ఉజ్వల భవిష్యత్‌ ఉందని గ్రహించి, సమైక్య రాష్ట్రంలో ఐటి రంగం ఏర్పాటుకి ఎంతగానో కృషి చేశారని మెచ్చుకున్నారు.

ADVERTISEMENT

ఆ రోజుల్లోనే తాను చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేసినప్పుడు ఆయన ఆలోచనా విధానం, పనితీరు, దూరదృష్టి చూసి ఆశ్చర్యపోయానని చంద్రశేఖరన్ అన్నారు. ఉదయం 6 గంటలకే చంద్రబాబు నాయుడుతో సమావేశాలు మొదలైపోయేవని చెప్పారు.

చంద్రబాబు నాయుడు ఏదైనా అనుకుంటే అది సాధించి చూపుతారని, ఆ పని పూర్తిచేసేందుకు ఆయన చూపే శ్రద్ద, నేర్పు నేటికీ తనని అబ్బురపరుస్తుందన్నారు.

ఆనాడు చంద్రబాబు నాయుడు పట్టుదల, కృషి, తోడ్పాటు, దూరదృష్టి వలననే హైదరాబాద్‌లో తమ టీసీఎస్ కంపెనీతో సహాయ అనేక వందల ఐటి కంపెనీలు ఏర్పాటయ్యాయని వాటి వలన లక్షల మందికి ఉద్యోగాలు లభించాయని చంద్రశేఖరన్ అన్నారు.

కనుక మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేసే అవకాశం లభించినందుకు తాను చాలా సంతోషిస్తున్నానని చెప్పారు. రాష్ట్రాభివృధ్ది కొరకు ఓ నివేదిక రూపొందించి ఇచ్చే బాధ్యత తనకు అప్పగించడాన్ని చాలా గౌరవంగా భావిస్తున్నానని చంద్రశేఖరన్ అన్నారు.

ఏపీ అభివృద్ధికి టాస్క్ ఫోర్స్ ఛైర్మన్‌గా తనను నియమించినట్లు తెలియగానే దేశ విదేశాలలో ఉన్నత స్థాయిలో ఉన్న పలువురు తెలుగువారు ఏపీ అభివృద్ధికి తమ సేవలను ఉపయోగించుకోవాలని నాకు ఈమెయిల్స్ పంపారని, ఇది చాలా శుభసూచికమని చంద్రశేఖరన్ అన్నారు.

ఏపీని ఏవిదంగా అభివృద్ధి చేయాలనే దానిపై పూర్తి స్పష్టత, మంచి ప్రణాళిక కలిగిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏపీ అభివృద్ధికి అవసరమైన వనరులన్నీ ఉన్నాయి. ముఖ్యంగా ఐటి నిపుణులున్నారు. కనుక ఐటి కంపెనీలకు, పరిశ్రమలకు భూములు కేటాయించి, ప్రోత్సాహకాలు కల్పిస్తే చాలన్నారు చంద్రశేఖరన్.

తాడేపల్లి ప్యాలస్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న జగన్‌, ఆయన కోసం నికృష్ట రాజకీయాలు చేస్తున్న వైసీపీ నేతలకి టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌ చంద్రశేఖరన్ చెపుతున్న ఈ మాటలు వినిపించడం లేదా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Fauzi New Release Date: But Why Don’t Fans Believe It?

Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…

5 hours ago

Desi Man Arrested at US Airport: H-1B Revoked

The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…

5 hours ago