
[m9ad]
టాక్సీవాలా సినిమాకి నిర్మాతగా మారిన “SKN” నిన్న టాక్సీ వాలా సక్సెస్ మీట్ లో మైక్ దొరకగానే విజయ్ దేవరకొండని ఆకాశానికి ఎత్తేసి తెగ పొగిడేసాడు. అయితే ఇలాంటి ఫంక్షన్స్ లో అలాంటి పొగడ్తలు షరా మామూలే అనుకోండి..పైగా విజయ్ స్పీడ్ కూడా మంచి హైలో ఉంది అనుకోండి, కానీ తెలుగు ఇండస్ట్రీని మాహిష్మతీ రాజ్యంగా పోల్చి, విజయ్ ని బాహుబలిగా పోల్చి… “మాహిష్మతీ ఊపిరి తీసుకో బాహుబలి వచ్చాడు” అన్న డైలాగ్ ని “తెలుగు ఇండస్ట్రీ ఊపిరి తీసుకో … విజయ్ దేవరకొండ వచ్చాడు” అంటూ చెప్పడం ఏదైతే ఉందో..అది మరీ అతిగానే అనిపిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
ఏది ఏమైనా పైరసీ అయిపోయిన సినిమా తోలి రోజే బ్రేక్ ఈవెన్ అయ్యి సూపర్ హిట్ అయిన ఆనందంలో అలా కాస్త హైపర్ గా మాట్లాడేసాడు కుర్ర నిర్మాత అని సరిపెట్టుకోవడమే.
కూటమి ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో విజయం సాధిస్తుందని అందరూ ఊహిస్తున్నదే. అయితే అది ఆ విజయాన్ని ఆస్వాదించలేని పరిస్థితి వైసీపీ…
Until a month ago, expectations were relatively low for Tamil star Dhanush’s next film, Om.…