
వైసీపీ నేతల మాటలు చూస్తే కోటలు దాటుతాయి…చేతలు చూస్తే గోడలు కూడా దాటవు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే నాకు ఓటేయండి అంటూ ఎన్నికల ప్రచారం పూర్తి చేసిన జగన్ ఇప్పుడు నాకు ఓటు వేయకపోతే మీ ఇంట్లో ఎవరు మిగలరు అనేలా తన సైన్యాన్ని రంగంలోకి దింపారు అనేలా వైకాపా నేతలు దాడులకు తెగబడుతున్నారు.
ప్రజలను ఎంతలా మభ్యపెట్టిన లాభం లేకపోవడంతో ఇక దాడులకు పాల్పడయినా ఓటమి నుంచి తప్పించుకోవాలి అనుకున్న కొంతమంది వైసీపీ నేతలు తమ చేతులకు, కర్రలకు పని చెప్పారు. ఇందులో భాగంగా అనేక చోట్ల టీడీపీ నేతల పైన, టీడీపీ బూత్ ఏజంట్లుగా పనిచేస్తున్న వారి పైన దాడులకు దిగారు వైకాపా శ్రేణులు. ఈ దాడిలోనే పల్నాడుకు చెందిన ఒక టీడీపీ మహిళ తీవ్రంగా గాయపడ్డారు.
తలకు గాయమై తీవ్రంగా రక్త స్రావం జరుగుతున్నప్పటికీ గాయానికి ఒక కట్టకట్టుకుని పోలింగ్ బూత్ లో తన బాధ్యత నెరవేరుస్తుంది ఆ మహిళ. దీనితో మరోసారి సోషల్ మీడియాకు ఆహారమయ్యారు జగన్. విజయవాడలో జగన్ మీద గులరాయి దాడి జరిగితేనే దానికి రెండింతలు బ్యాండేజ్ వేసుకుని రెండు వారలు గడిపిన జగన్ తన పై హత్య ప్రయత్నం జరిగిందంటూ గగ్గోలు పెట్టారు.
జగన్ సింహం, పులివెందుల పులి అంటూ వైకాపా నాయకులు సినిమా హీరో స్టైల్ లో హైప్ ఎక్కిస్తే ఈయన గారు పిల్లి మాదిరి గులకరాయికి భయపడ్డారు అంటూ టీడీపీ సోషల్ మీడియా మరోసారి జగన్ ను గట్టిగా ఏసుకుంటున్నారు. మీ వైసీపీ మూకల దాడిలో గాయపడి కూడా భయపడకుండా కట్టకట్టుకుని బూత్ లో కూర్చున్న నీ తెగువకు, పల్నాటి పౌరుషానికి నీకు దండం తల్లి అంటూ జగన్ ఫొటోతో ఈమె ఫోటోను వైరల్ చేస్తున్నారు.
వైసీపీ దృష్టిలో గాయం కనపడకుండా దెబ్బ తగిలితే అది హత్యాప్రయత్నం…అదే రక్తం కారేలా గాయమైతే అది అనుకోని ఘటన అంతేగా..? వైకాపా డిక్షనరీ లో ముమ్మాటికీ ఈ మహిళల మీద జరిగింది హత్యాప్రయత్నం కానేకాదుగా జగన్ గారు..?
Rajinikanth is going to return to the big screen tomorrow with his new film Jailer…
స్థానిక సంస్థల ఎన్నికలలో సీట్ల సర్దుబాట్ల విషయంలో సోషల్ మీడియాలో ఇరు వర్గాల మద్దతుదారులు చేస్తున్న వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా…