బీజేపీతో పొత్తులు పులి మీద సవారీయేనా?

మరో వారం-పది రోజులలో ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. టిడిపి, జనసేనలతో బీజేపీ కలిసి పనిచేస్తుందో లేదో ఇంతవరకు చెప్పకుండా నాన్చుతోంది. ఈ కారణంగా ఆ రెండు పార్టీలు తమ జాబితాలు, అభ్యర్ధులను ప్రకటించుకోలేని పరిస్థితి నెలకొంది.

చంద్రబాబు నాయుడు ఢిల్లీ పెద్దలతో నేరుగా మాట్లాడిన తర్వాత వెంటనే జగన్‌ కూడా వెళ్ళి వారితో మాట్లాడారు. ఏపీలో ఎలాగూ బీజేపీ అధికారంలోకి రాలేదు కనుక వైసీపికి సహకరిస్తే, లోక్‌సభ ఎన్నికల తర్వాత తన ఎంపీలతో కేంద్రంలో బీజేపీకి బేషరతుగా మద్దతు ఇస్తానని జగన్‌ ఆఫర్ ఇచ్ఛిన్నట్లు తెలుస్తోంది. అప్పటి నుంచే బీజేపీ వైఖరిలో మార్పు లేదా ఊగిసలాట మొదలైందని చెప్పవచ్చు.

ADVERTISEMENT

అందువల్లే టిడిపి, జనసేనలతో పొత్తు గురించి ఏమాత్రం తొందరపడటం లేదని భావించవచ్చు. బీజేపీ ఈవిదంగా ఆలస్యం చేస్తుండటం వలన దానికి కొత్తగా కలిగే నష్టం ఏమీ ఉండదు. కానీ దాని కోసం ఎదురుచూపులు చూస్తూ అభ్యర్ధులను ప్రకటించుకోలేకపోతున్న టిడిపి, జనసేనలు మాత్రం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. అంటే బీజేపీ పరోక్షంగా వైసీపికి సాయపడుతున్నట్లే కదా?

బీజేపీతో పొత్తు ఆలోచన చేస్తేనే వాటి పరిస్థితి ఈవిదంగా ఉంది ఒకవేళ అది వాటితో పొత్తుకి సిద్దమైతే పులి మీద సవారీగా మారుతుందేమో?

ఈ నేపధ్యంలో చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ బీజేపీతో పొత్తుపై అమీతుమీ తేల్చేసుకునేందుకు గురువారం ఢిల్లీ వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ బీజేపీ తేల్చకపోతే బహుశః ఇదే వారి ఆఖరి సమావేశం కావచ్చు.

ఢిల్లీ బయలుదేరే ముందు నేడు చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ భేటీ అవుతున్నారు. బీజేపీతో పొత్తు కుదిరితే దాంతో ఏవిదంగా సీట్ల సర్దుబాట్లు చేసుకోవాలి?ఒకవేళ కుదరకపోతే మిగిలిన 57 సీట్లను రెండు పార్టీలు ఏవిదంగా పంచుకోవాలి?అనే విషయాలు వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

జనసేనకు లభించిన 24 సీట్లలో 5 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించినందున మిగిలిన 19 స్థానాలలో మరికొన్నిటికి నేడు జనసేన అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో ఈరోజు ఆమె బయలుదేరి వెళ్ళారు. బహుశః టిడిపి, జనసేనలతో పొత్తు, సీట్ల సర్దుబాట్ల గురించి ఆమె అభిప్రాయం తెలుసుకునేందుకే ఢిల్లీకి పిలిపించి ఉండవచ్చు. ఈసారి ఏపీ ఎన్నికలలో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ఇటీవల ఊహాగానాలు వినిపించాయి. కనుక ఈ వారంలోనే టిడిపి, జనసేనలతో బీజేపీ పొత్తు ఉంటుందా లేదా? అనే విషయం తేలిపోవచ్చు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Anirudh’s Paradise Failure Now Haunts Jailer 2 Hopes

Recently, the much-anticipated interview of Jailer with its cast and crew took place, during which…

36 minutes ago

CJP Leaders Released as Delhi Tightens Security

Three Cockroach Janata Party (CJP) leaders detained ahead of a protest demanding the resignation of…

1 hour ago