
తెలంగాణ శాసనసభ ఎన్నికల బరిలో నుంచి టిడిపి తప్పుకోవడంతో బిఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్. అది ఎన్నికల నుంచి తప్పుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు పరోక్షంగా సహకరిస్తోందని బిఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు. అలాగని గట్టిగా కూడా వాదించలేకపోతున్నారు.
ఎందుకంటే, 2018 ఎన్నికలలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని పోటీ చేసినప్పుడు కూడా తప్పు పట్టారు కనుక. అయితే అప్పుడు టిడిపి ఎన్నికలలో పోటీ చేయడం వలననే బిఆర్ఎస్ పార్టీ లాభపడింది. కాంగ్రెస్ మాటున చంద్రబాబు నాయుడు మళ్ళీ తెలంగాణపై రాజకీయంగా పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్నారని, తెలంగాణను దోచుకొనేందుకే వస్తున్నారంటూ ప్రచారం చేసుకొని ప్రజలలో తెలంగాణ సెంటిమెంట్ రగిలించి ఎన్నికలలో గెలిచింది.
కానీ ఈసారి టిడిపి పోటీ చేయకపోవడం వలన బిఆర్ఎస్ పార్టీ ఈసారి దానిని బూచిగా చూపించలేకపోతోంది. పైగా టిడిపి పోటీ నుంచి తప్పుకొని తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రా ఓటర్లలో చీలికను తగ్గించగలిగింది. కనుక టిడిపికి ఓట్లు వేయాలనుకొనేవారు, చంద్రబాబు నాయుడు అరెస్టు పట్ల సానుభూతితో ఉన్నవారు అందరూ కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేసే అవకాశం కనిపిస్తోంది.
ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోనే 24 సీట్లు, అక్కడే అత్యధికంగా ఆంద్రా ఓటర్లు ఉన్నారు. వాటిలో 7 స్థానాలు మజ్లీస్, మరో 7-8 బిఆర్ఎస్, 1-2 బీజేపీ గెలుచుకొన్నా మిగిలిన సీట్లన్నీ కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశం ఎక్కువగా ఉంది. తెలంగాణ మొత్తంగా చూసుకొంటే టిడిపి తప్పుకోవడం వలన బిఆర్ఎస్ పార్టీ కనీసం 15-20 సీట్లు కాంగ్రెస్ పార్టీకి కోల్పోయే సూచనలు కనిపిస్తున్నాయి.
కనుక తెలంగాణలో టిడిపి కూడా ఉంటేనే బిఆర్ఎస్ పార్టీకి లాభమని స్పష్టమవుతోంది. కానీ టిడిపిని వద్దనుకొన్నందుకు బహుశః ఇప్పుడు లోలోన బాధపడుతోందేమో?
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…