Telugu

బరి తెగించారు…బలిచేసారు..!

రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు సహజం. అయితే రాజకీయాలలోకి వ్యక్తిగత విషయాలను జత చేయొచ్చా, వాటి మీద విమర్శలు చేయొచ్చా అంటే ఏదైనా ఒక స్థాయి వరకు అవి హేతుబద్ధమే అయినప్పటికీ హద్దు దాటకూడదు.

రాజకీయాలలో విమర్శలు ఎపుడు విశ్లేషనాత్మకంగానే ఉండాలి. అంతేకాని ఒకరిని కించపరిచేవిగాను, ఒకరిని అవమానించేవికాను, ఒకరిని బెదిరించే ధోరణిలోకి కానీ విమర్శలు చెయ్యకూడదు. వాటిని ప్రజలు ఏ మాత్రం ఆమోదించరని వైసీపీ నేతలకు ఇప్పటికి తెలిసి రాకపోవడం కాస్త విస్మయానికి గురి చేస్తుంది.

ADVERTISEMENT

వైసీపీ పతనానికి వైసీపీ నాయకుల నోటి దూల కూడా ఒక ప్రధాన కారణమని ఏపీ రాజకీయాలను పరిశీలించే చిన్న పిల్లాడిని అడిగిన చెపుతాడు. కానీ కొన్ని కోట్ల ప్రజాధనం వెచ్చించి మరి పార్టీ కోసం పెట్టుకున్న IPAC టీం చెప్పలేకపోవడం ఆశ్చర్యమే. ఏది ఏమైనా వైసీపీ నేతల బరి తెగింపుకు ఫలితం నేడు అనుభవిస్తుంది వైసీపీ.

అయినా ఇప్పటికి ఆ పార్టీ నాయకులకు బుద్ది రాలేదు. ఆ పార్టీ సాక్షి మీడియాకు సిగ్గు లేదు. డిబేట్ లపేరుతో వైసీపీ ఉగ్రవాదులను తన మీడియాలో కూర్చోపెట్టుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ను వాడు ..వీడు, డెలివరీ బాయ్, స్విగ్గి బాయ్ అంటూ హేళన చేయడం, అవమానకరంగా దూషించడం చూస్తుంటే జగన్ చెపుతున్న మీడియా విలువలు ఇవేనా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ను ఉద్దేశించి గత మావోయిస్టుల దాడిలో వేంకటేశ్వర స్వామి బాబు ను బయట పడేసారు కానీ ఈసారి బాబుకి ఆ ఛాన్స్ ఉండదు అంటూ బెదిరించే ధోరణిలో టీడీపీ క్యాడర్ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసారు వైసీపీ నేత నాగార్జున యాదవ్.

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి ఒక మాజీ ముఖ్యమంత్రి మీడియాలో ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం అంటే వైసీపీ బరితెగింపుకు అంతం లేదా? అనే సందేహం సామాన్యుడిని సైతం కదిలిస్తుంది. అసలు వైసీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకు వెళ్లాలని భావిస్తుంది. ఏపీ ప్రజలు వైస్ కుటుంబానికి చేసిన కీడెంటి.? ఏపీ మీద జగన్ కు ఎందుకింత పగా.?

రాష్ట్ర ముఖ్యమంత్రులను ఈ స్థాయిలో కించపరిచి ఏ పార్టీ కార్యకర్తలకు బీపీలు తెప్పించాలని జగన్ భావిస్తున్నారు. అటు కాంగ్రెస్ ఇటు టీడీపీ అగ్రనేతల మీద ఇటువంటి విమర్శలు చేస్తే ఆయా పార్టీల కార్యకర్తలు రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తారని తద్వారా రాష్ట్రానికి రావాలని అనుకుంటున్న పరిశ్రమలు తరలిపోతాయని జగన్ ఆశిస్తున్నారా.?

తానూ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పారిశ్రామిక వేత్తలెవ్వరు ఏపీ సరిహద్దులను కూడా తాకలేకపోయారు.కానీ ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఒక్కో భారీ పరిశ్రమ ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ సంక్లిష్ట సమయంలో రాష్ట్రంలో అలజడిని సృష్టించి ఏపీలో పరిశ్రమ అనే మాట వినపడకుండా చేయాలనుకుంటున్నారా.?

ఇప్పటికే ఏపీ బ్రాండ్ వ్యాల్యూ కేసులు, బూతులు స్థాయికి పడిపోయింది. దానిని చెరిపే ప్రయత్నంలో బాబు చేస్తున్న ఈ అలసత్వాన్ని వైసీపీ చేతకాని తనంగా భావించి రెచ్చిపోతూనే ఉంది. శిశుపాలుడి తప్పులకు ఒక లెక్క ఉంది కానీ ఈ వైసీపీ తిక్కకు లెక్కలేకుండా పోతుంది.

వైసీపీ రాజకీయ అరంగేట్రం తోనే ఏపీ రాజకీయాలలో పెను విష మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పటి వరకు లేని విగ్రహ రాజకీయాలు, శవ రాజకీయాలు, రాజకీయ విమర్శలలోకి మహిళలను లాగడం, వ్యక్తిగత జీవితాన్ని రోడ్ల మీదకు తీసుకురావడం, బూతులు తిట్టడం, దాడులు చెయ్యడం ఇవన్నీ రాజకీయాలలో వైసీపీ నాటిన విత్తనాలే.

ఈ విష సంస్కృతితో గడిచిన ఐదేళ్ళుగా వైసీపీ నేతలు బరితెగించి రాష్ట్ర పరువును బజారున పెట్టి రాష్ట్ర భవిష్యత్తును బలి చేసారు. ఈ విష సంస్కృతులు సమాజానికి హానికరం అనే ఉదేశంతోనే వైసీపీ కి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కనివవలేదు ఏపీ ఓటర్లు.

అయినా సాక్షి కానీ, వైసీపీ నాయకులు కానీ, ఆ పార్టీ అధినేత జగన్ కానీ తమ తప్పును సరిదిద్దుకోవాలి అనే ఆలోచనలోకి వెల్ళకపోగా అదే పంథాను అనుసరిస్తున్నారు. ముఖ్యమంత్రిని ఇలా అనొచ్చా? అలా అనొచ్చా? అంటే మా పార్టీ కార్యకర్తలు ఊరుకుంటారా? అంటూ నీతులు చెప్పిన జగన్ చేస్తే తప్పేముంది అంటూ బూతులు మాట్లాడుతున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

ఈ 10 డీఎస్సీ కాదు.. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లే!

జాబ్ నోటిఫికేషన్స్ గురించి ఎదురుచూస్తున్న రాష్ట్రంలో యువతకు వాటి గురించి పూర్తి స్పష్టత ఉంది. కానీ ఐదేళ్ళు సిఎంగా రాష్ట్రాన్ని…

11 minutes ago

Is Rashmika Mandanna India’s No. 1 Actress?

Director Rahul Sankrityan had some big words for Rashmika Mandanna at the Ranabaali pre-release event.…

39 minutes ago