
అయితే ఇంతకాలం బిజెపి అధిష్టానం ఇందుకు సానుకూలంగా స్పందించలేదు. అయితే హటాత్తుగా మనసు మార్చుకొని ఈ నెల 18న ఢిల్లీలోని అశోకా హోటల్లో జరుగబోయే బిజెపి మిత్రపక్షాలు (ఎన్డీయే) సమావేశంలో పాల్గొనవలసిందిగా టిడిపికి ఆహ్వానం పంపింది.
అంటే టిడిపిని మళ్ళీ ఎన్డీయేలో చేర్చుకొనేందుకు బిజెపి సిద్దంగా ఉందనే భావించవచ్చు. అంటే ఏపీలో టిడిపితో బిజెపి మళ్ళీ పొత్తులకు కూడా అంగీకరించిన్నట్లే భావించవచ్చు.
అయితే బిజెపి అధిష్టానం హటాత్తుగా ఎందుకు మనసు మార్చుకొంది? టిడిపిని మళ్ళీ కలుపుకుపోవాలని ఎందుకు అనుకొంటోంది?అంటే తెలంగాణ శాసనసభ ఎన్నికలు ఓ కారణమని చెపొచ్చు. తెలంగాణలో బిజెపి చాలా బలపడినప్పటికీ, నేటికీ కేసీఆర్ని, బిఆర్ఎస్ మంత్రులను, ఎమ్మెల్యేలను ఢీకొని నిలబడగల నేతలు బిజెపిలో చాలా కొద్దిమందే ఉన్నారు.
కనుక ఇతర పార్టీల నుంచి బలమైన అభ్యర్ధులను బిజెపిలోకి రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు. ఈ పరిస్థితులలో టిడిపి సహాయసహకారాలు బిజెపికి చాలా అవసరం.
తెలంగాణలో నేటికీ టిడిపికి బలమైన క్యాడర్, నేతలు ఉన్నారు. కొన్ని నెలల క్రితం చంద్రబాబు నాయుడు ఖమ్మంలో విజయవంతంగా బారీ బహిరంగసభ నిర్వహించడమే ఇందుకు నిదర్శనం. ఇదీగాక తెలంగాణ రాజధాని హైదరాబాద్తో సహా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఆంధ్రా ప్రజలు స్థిరపడ్డారు. అయితే వారు బిజెపిని, ప్రధాని నరేంద్రమోడీని చూసి ఓట్లు వేయరు. కేసీఆర్ ప్రభావంలో ఉన్న వారి ఓట్లు పొందడానికి బిజెపికి టిడిపి సహకారం చాలా అవసరం ఉంటుంది.
ఇక జాతీయస్థాయిలో కూడా బిజెపి వ్యతిరేక శక్తులన్నీ మళ్ళీ ఏకం అవుతున్నాయి. వాటితో కాంగ్రెస్ పార్టీ కూడా చేయి కలుపుతోంది. కనుక బిజెపి కూడా తన మిత్రపక్షాలను పెంచుకోవడం చాలా అవసరం. అందుకే వివిద కారణాలతో ఎన్డీయేలో నుంచిబయటకు వెళ్ళిపోయిన మిత్రపక్షాలను బిజెపి మళ్ళీ ఆహ్వానిస్తోంది. టిడిపిని ఆహ్వానించడం వెనుక ఇదీ ఓ కారణమే.
ఏపీలో టిడిపికి కేంద్రం సహాయసహకారాలు అవసరం కాగా తెలంగాణలో బిజెపికి టిడిపి సహాయసహకారాలు అవసరం ఉన్నాయి. బహుశః అందుకే మళ్ళీ టిడిపిని ఎన్డీయే కూటమిలోకి ఆహ్వానిస్తోందనుకోవచ్చు. అంటే ఇచ్చి పుచ్చుకోవడం అని భావించవచ్చు.
Kiran Abbavaram, who has acted in several successful films, is making his directorial debut with…
Nagarjuna has decided to present the film Itllu Arjuna under his Annapurna Studios banner after…