గుడివాడలో టీడీపీ…విశాఖలో జనసేన..! వైసీపీలో ఎందుకీ ఈ కంగారు..?

సాధారణంగా అధికార పార్టీ ప్రతిపక్షాల పార్టీల కార్యక్రమాల పై తన అజమాయిషీ చూపించాలని, తన పవర్ ఏంటో విపక్షలకు తెలియచెప్పాలని ఆరాటపడుతూ ఉంటుంది. ఇది సర్వ సాధారణంగా జరిగే అంశమే. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ తన పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించిన రానంత గందరగోళం, అధికారుల ఒత్తిడి టీడీపీ పార్టీకి ఒక్క గుడివాడలోనే ఎదురవుతుంది.

దీనికి కారణం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా..! వైసీపీ ఫైర్ బ్రాండ్, ఏపీ బూతుల మంత్రి అంటూ చాలా డిగ్రీలే సంపాదించుకున్నారు గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. గుడివాడలో ఎన్టీఆర్ 26 వ వర్థంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ నాయకులకు పోటీగా కొడాలి నాని కూడా ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. దీనితో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా భయానకంగా మారిపోయింది.

ADVERTISEMENT

ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడానికి వెళుతున్న టీడీపీ నాయకులను అటు పోలీసు అధికారులు, ఇటు వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.మా పార్టీ కార్యక్రమం పై మీ హడావుడి ఏంటంటూ టీడీపీ నేతలు, మా ప్రాంతంలో మీ కార్యక్రమాలేంటంటూ వైసీపీ నేతలు బాహాబాహీలు పడ్డారు.

అలాగే స్థానిక ఎమ్మెల్యే కూడా యధావిధిగా టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా నారా, నందమూరి కుటుంబసభ్యుల మీద తన స్థాయికి తగ్గ విమర్శలు చేసి గుడివాడలో మరోసారి టీడీపీ కార్యక్రమాన్ని రసాభాసా చేసారు.ఇపుడే కాదు గతంలో కూడా గుడివాడలో టీడీపీ పార్టీ తరుపున ఏ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఇదే రకమైన వాతావరణాన్ని సృష్టించి టీడీపీ పార్టీని కట్టడి చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు స్థానిక వైసీపీ నేతలు.

గుడివాడ పరిస్థితి ఇలా ఉంటే విశాఖలో వైసీపీ తీరు మరోలా ఉంటుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో ఎక్కడ సభలు పెట్టిన సభ ముగిసే లోపో, లేక సభ ముగిసాకో మీడియా ముందుకొచ్చి తమకిచ్చిన స్క్రిప్ట్ పేపర్ చదివేసి వెళ్లిపోయే వైసీపీ నేతలు విశాఖలో మాత్రం పవన్ పర్యటనను ఎప్పుడు ఏదోఒక సాకుతో అడ్డుకోవడానికే ప్రయత్నిస్తుంటారు.జనసేన పార్టీ నిర్వహించే ‘జనవాణి’ కార్యక్రమం మొదలు పవన్ ‘వారాహి యాత్ర’ వరకు జనసేన ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు వైసీపీ నేతలు.

ఒక స్టార్ హీరో ఇమేజే ఉంది, ఒక పార్టీ అధినేత హోదాలో ఉన్న పవన్ ను సైతం పోలీసు అధికారులు ఒక హోటల్ గదిలో నిర్బంధించిన తీరు కానీ, అధికారులు పవన్ పట్ల ప్రవర్తించిన ప్రవర్తన కానీ వైసీపీ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని ఏవిధంగా పాలన చేస్తుంది అనేదానికి అద్దం పట్టింది. విశాఖ వెళ్ళడానికి బుక్ చేసుకున్న ప్రవైట్ ఫ్లయిట్లను సైతం ప్రభుత్వ రద్దు చేసింది అంటేనే అర్ధమవుతుంది వైసీపీ ఎందుకింతలా కంగారు పడుతుంది అనేది.

ఇలా గుడివాడలో టీడీపీ పార్టీకి…విశాఖలో జనసేన పార్టీకి వైసీపీ పార్టీ ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ ఎందుకు ఏర్పాటు చేసిందో…ఎందుకు విపక్ష నేతల పర్యటనలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుందో…ఎందుకు కట్టడి చేయాలనీ కంగారు పడుతుందో…ఏ విషయాలు బయటకొస్తాని బయపడుతుందో…ఆ జగన్నాటకాలేమిటో స్థానిక వైసీపీ నాయకులకే తెలియాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

బొద్దింకలు మాకు థాంక్స్ చెప్పాయి.. అందరూ విన్నారా?

ఢిల్లీలో సీజేపీ ఆందోళనలకు సోషల్ మీడియా ద్వారా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. అందుకు సీజేపీ నేతలు…

21 minutes ago

Career Setbacks, Social Media Trolls: Cricketer Breaks Silence

Prithvi Shaw has opened up about dealing with social media backlash, mistakes from his past…

30 minutes ago