
బీజేపీ కారణంగా పొత్తుల గురించి ఎటూ తేల్చుకోలేకపోతున్న టిడిపి, జనసేనలు జగన్ పుణ్యమాని వెంటనే సమావేశం ఏర్పాటు చేసుకొన్నాయి. అంతేకాదు… వంద రోజుల ఉమ్మడి కార్యాచారణ నిర్ణయించుకొన్నాయి. తద్వారా వాటి పొత్తులు, విధానాలు, వివిద అంశాలపై వాటి వైఖరి గురించి రాష్ట్ర ప్రజలు కూడా అర్దం చేసుకొని, ఓ నిర్ణయం తీసునేందుకు వీలుగా వాటికి తగినంత సమయం కూడా జగనే కల్పించారు.
అంతేకాదు… ఉమ్మడి మ్యానిఫెస్టో రూపొందించుకొనేందుకు తగిన సమయం కూడా జగనే కల్పించారు. ఆయన ఏది జరగకూడదనుకొన్నారో దానిని ఆయన చేతే ‘ఏ దేవుడో’ చేయించాడు. దీన్నే దేవుడి స్క్రిప్ట్ అంటారేమో?
ఇంతకాలం టిడిపి వస్తే ఎలా ఉంటుంది?ఒకవేళ మళ్ళీ వైసీపి వస్తే ఎలా ఉంటుందని మాత్రమే ప్రజలు ఆలోచిస్తున్నారు. కానీ టిడిపి, జనసేనలు పూర్తి అవగాహనతో, రెండు పార్టీలు ఆమోదించుకొన్న విధానాలు, హామీలతో కూడిన ఓ బలమైన మ్యానిఫెస్టోతో ప్రజల ముందుకు వచ్చి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పబోతున్నాయి.
ఈ ప్రతిపాదన కొత్తది. చాలా ఆసక్తికరంగా కూడా ఉంటుంది. ముఖ్యంగా రాజాధాని అమరావతి, పరిశ్రమలు, ఐటి కంపెనీలు, ఆర్ధిక విధానాలలో రెండు పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్నాయి. కనుక ప్రజలు తప్పకుండా ఈ ప్రత్యామ్నాయం వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి.
వంద రోజుల ఉమ్మడి కార్యాచరణతో టిడిపి, జనసేనలకు తమ కూటమి పట్ల ప్రజలకు నమ్మకం కలిగించేందుకు అవకాశం లభించింది. ఒకవేళ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళి ఉంటే వాటికి కనీసం సీట్ల సర్దుబాట్లు చేసుకొనే అవకాశం కూడా ఉండేది కాదు కదా?కనుక ఇందుకు టిడిపి, జనసేనలు జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకోవలసిందే.
Kobali from Ranabaali is a fusion of devotion, anger and cinematic elements. The song presents…
Ranbir Kapoor, Yash and Sai Pallavi are starring in the upcoming adaptation of Ramayana, directed…