టీడీపీ + జనసేన….’ఓటు బదిలీ’ సాధ్యమా..?

2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీని గద్దె దింపడమే ఉమ్మడి లక్ష్యంగా ముందుకెళ్తున్న టీడీపీ, జనసేనలు పొత్తు నుంచి సీట్ల సర్దుబాటు వరకు వచ్చారు. అయితే తొలి జాబితాలో విడుదలైన 118 సీట్లకు గాను టీడీపీ 94 , జనసేన 24 సీట్లు కేటాయించారు. అయితే జనసేన అధినేత పవన్, బీజేపీ కూడా ఈ కూటమితో కలిసి వస్తుందనే ఆశతో 24 సీట్లకే ఫిక్స్ అయ్యాం అంటూ ప్రకటించడంతో జనసైనికులలో సీట్ల సంఖ్య పట్ల అసంతృప్తి మొదలయ్యింది.

పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 24 సీట్లే కేటాయించడంతో జనసేన పార్టీ నుంచి టీడీపీ పార్టీకి ఓటు బదిలీ జరిగే అవకాశం ఉంటుందా అంటూ కొందరు…, అలాగే తానూ పోటీ నుంచి తప్పుకుని జనసేనకు అవకాశం కల్పించిన స్థానాలలో టీడీపీ నుంచి జనసేన కు ఓటు బదిలీ అవుతుందా అంటూ మరికొందరు భావిస్తున్న ఈ తరుణంలో కచ్చితంగా జరుగుతుంది అని 2014 , 2019 గణాంకాల ఆధారంగా చెప్పవచ్చు.

ADVERTISEMENT

2014 విభజన ఆంధ్రపదేశ్ కు జరుగుతున్న మొదటి ఎన్నికలలో పవన్ జనసేన పార్టీ స్తాపించినప్పట్టికి ఏపీ ఉన్న ఈ పరిస్థితికి ఒక అనుభవం ఉన్న నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం అంటూ ఎన్నికల బరిలో లేకుండా టీడీపీ – బీజేపీ పొత్తుకు మద్దతు తెలియచేసి కొన్ని ప్రాంతాలలో రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం కూడా చేసారు.

ఈ తరుణంలో పవన్ కు తమ రాజకీయ మద్దతు తెలియచేయాలి అని భావించిన వారంతా టీడీపీ – బీజేపీ కూటమికి తమ ఓటుతో మద్దతు పలికారు. అలాగే 2014 ఎన్నికలలో టీడీపీ తో పొత్తు పెట్టుకున్న బీజేపీ పార్టీకి ఏపీ లో ఎటువంటి బలం లేకపోయినప్పటికీ కూడా అటు టీడీపీ నుంచి ఓటు బదిలీ జరిగి నాలుగు అసెంబ్లీ స్థానాలలో విజయం సాధించింది. అదే బీజేపీ 2019 లో ఒంటరిగా ఎన్నికల పోటీకి సిద్ధమైతే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది.

2014 ఎన్నికలలో టీడీపీ + బీజేపీ పోటీలో బీజేపీ ఓటింగ్….అలాగే 2009 , 2019 లో బీజేపీ ఓటింగ్ చూసుకుంటే పొత్తులో టీడీపీ ఓటింగ్ మిత్ర పక్షమైన బీజేపీ కి బదిలీ అయ్యిందా లేదా అనే అనుమనాలకు చెక్ పెట్టినట్టే. దానికి గత ఎన్నికలలో బీజేపీ పోటీ చేసిన కొన్ని ప్రాంతాలను ఉదాహరణలుగా చూద్దాం.

* విశాఖ నార్త్: 2009 బీజేపీ ఓటింగ్ : 4299
2014 – టీడీపీ +బీజేపీ: బీజేపీ ఓటింగ్ : 82079
2019 – బీజేపీ : 18790

* పాడేరు: 2009 బీజేపీ ఓటింగ్: 3849
2014 – టీడీపీ+బీజేపీ: బీజేపీ ఓటింగ్: 17029
2019 – బీజేపీ : సుమారుగా 5000

* రాజమండ్రి: 2009 బీజేపీ ఓటింగ్ : 1580
2014 – టీడీపీ + బీజేపీ : బీజేపీ ఓటింగ్ :79531
2019 – బీజేపీ: 3003

* తాడేపల్లి గూడెం: 2009 బీజేపీ ఓటింగ్ : 771
2014 – టీడీపీ + బీజేపీ ఓటింగ్:73339
2019 – బీజేపీ : సుమారుగా 2000

* కైకలూరు: 2009 బీజేపీ ఓటింగ్: 822
2014 – టీడీపీ+బీజేపీ ఓటింగ్: 88092
2019 – బీజేపీ : సుమారు 1500

* విజయవాడ వెస్ట్: 2009 బీజేపీ ఓటింగ్ : 3484
2014 – టీడీపీ + బీజేపీ ఓటింగ్: 60072
2019 – బీజేపీ : సుమారుగా 3500

* నర్సరావుపేట : 2009 బీజేపీ ఓటింగ్: 960
2014 – టీడీపీ+బీజేపీ ఓటింగ్: 71995
2019 – బీజేపీ: 6 నుండి 7 వందల మధ్య

* మదనపల్లె : 2009 బీజేపీ ఓటింగ్:1515
2014 – టీడీపీ+బీజేపీ ఓటింగ్: 64663
2019 – బీజేపీ : 1500 లోపే …

ఇలా చెప్పుకుంటూ పొతే కొడుమూరు, నెల్లూరు రూరల్…ఇలా బీజేపీ కి అసలు పట్టులేని స్థానాలలో టీడీపీ తో పొత్తు వలన పెరిగిన ఓటింగ్ శాతం చూస్తే టీడీపీ పార్టీ నుండి ఓటు బదిలీ జరుగుతుందా లేదా అనేది జనసైనికులకు ఒక స్పష్టత వస్తుంది. పొత్తులో ఉన్నప్పుడు వేలల్లో ఉన్న ఓటింగ్ పొత్తు లేకపోతే వందలలోకి పడిపోయింది.

అలా చూసిన 2009 కన్నా 2019 లో బీజేపీ పార్టీ ఒంటరిగా పోటీ చేసినప్పటికీ తన ఓటింగ్ ను పెంచుకోగలిగింది. ఒక జాతీయ పార్టీగా ఉన్న బీజేపీ ఏపీ పట్ల అన్యాయం చేస్తుంది అనే భావనలో ఉన్న కూడా ఒకసారి పొత్తు పెట్టుకోవడం ద్వారా స్థానికంగా తన బలాన్ని కొంత వరకు పెంచుకోగలిగింది.

ఈ గణాంకాల ఆధారంగా పొత్తులో భాగంగా టీడీపీ ఓటు బ్యాంకు బీజేపీ కి బదిలీ అయ్యింది….అలాగే 2014 ఎన్నికలలో పోటీ చేయకుండా బాబు కూటమికి మద్దతు తెలియచేయడంతో పవన్ మద్దతుదారుల ఓటు టీడీపీ కి బదిలీ అయ్యింది అనేది సుస్పష్టమయ్యింది. కాబట్టి ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు ఎటువంటి అనుమానాలకు తావు ఇవ్వకుండా ఉమ్మడి లక్ష్యం వైపు అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమయ్యినదని గుర్తించాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Lukkhe Review: Familiar But Decent Anti-Drugs Story

BOTTOM LINE Familiar But Decent Anti-Drugs Story PLATFORM Amazon Prime Video RUNTIME 5 Hours 27…

15 minutes ago

Emirates Buys 29 Airbus A380s Amid Record $6.2Bn Profit

Emirates has purchased 29 Airbus A380 superjumbos along with five Boeing 777 aircraft during the…

19 minutes ago