
ఒక రాజకీయ పార్టీల అధినేతల పాపులారిటీ, రాజకీయ చాతుర్యం, వైఖరి వంటివి ఆ పార్టీ మనుగడకు ప్రాధమిక అవసరం. ఎన్నికల్లో పార్టీల జయాపజయాలను నిర్ణయించే పలు అంశాల్లో ఈ లక్షణాలు కూడా చాలా కీలకమే.
అధినేత పార్టీకి మెదడు వంటి వారనుకుంటే, నేతలు శరీరం అనుకోవచ్చు. కానీ ఆ శరీరాన్ని నిలబెట్టే వెన్నెముకే పార్టీ కార్యకర్తలు. ఈ విషయాన్ని మొదటే గ్రహించిన టీడీపీ కార్యకర్తలను కాపాడుకుంటూ విజయాలు సాధిస్తోంది.
అధికారంలో లేని సమయంలో కార్యకర్తలను వాడుకొని తర్వాత నిర్లక్ష్యం చేసినందుకు వైసీపీ అధికారం కోల్పోయింది.
శరీరం, వెన్నెముక బాగున్నప్పటికీ మెదడు పనితీరు సరిగా లేకపోతే ఆ శరీరం నిరుపయోగం అవుతుందని పొరుగు రాష్ట్రాలలో పార్టీల ఓటమితో నిరూపితమైంది. మూడు సమన్వయంతో పనిచేస్తే విజయం సాధించవచ్చని తెలంగాణ కాంగ్రెస్ నిరూపించి చూపింది.
నిన్న తూర్పుగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించినప్పుడు, పార్టీ సమావేశంలో ప్రత్యేకంగా జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు గురించి చెప్పిన మాటలు టీడీపీలో అధినేతకు కార్యకర్తలకు, అదేవిధంగా కార్యకర్తలకు పార్టీతో, అధినేతతో ఎటువంటి అనుబంధం ఉందో, ఉండాలో తెలియజేస్తోంది.
“నిమ్మల రామానాయుడు ఎల్లప్పుడూ క్షేత్రస్థాయిలో పనిచేస్తుంటారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారు. ప్రజలతో మమేకం అవడం ఎలా అనేది ఆయనని చూసి మనమూ నేర్చుకోవాలి. అంతే కాదు.. రామానాయుడికి పార్టీ అంటే ఎంత అభిమానమంటే, మొన్న తన కూతురు పెళ్లిలో అందరూ కొత్త దుస్తులు ధరిస్తే ఆయన మాత్రం ఎప్పటిలాగే టీడీపీ యూనిఫారం (పసుపు దుస్తులు) ధరించారు…” అంటూ ఆయన వివిధ ప్రాజెక్ట్ పనులను ఎంత సమర్థంగా పర్యవేక్షిస్తున్నారో పార్టీ నేతలు, కార్యకర్తలకు సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు.
రామానాయుడు వంటి నిబద్ధత, సమర్థత కలిగిన నాయకులు టీడీపీ కలిగి ఉండటం ఆ పార్టీ అదృష్టమే. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇదే పదవి చేపట్టిన అంబటి రాంబాబు పని తీరు, మాట తీరు ఏవిధంగా ఉందో… ఆ పార్టీలో చాలా మంది నేతలు అదేవిధంగా ప్రవర్తిస్తే చివరికి ఎటువంటి ఫలితం వచ్చిందో అందరూ చూశారు.
కనుక పార్టీ పట్ల నిబద్ధత కలిగిన కార్యకర్తలను కాపాడుకోవడం చాలా అవసరం. అలాగే నిబద్ధత, సమర్దత కలిగిన నాయకులను గుర్తించి, వారికి తగిన బాధ్యతలు, ప్రాధాన్యం ఇవ్వడం చాలా అవసరం. అప్పుడే ఆ పార్టీలు విజయాలు సాధిస్తుంటాయి… అని కూటమి ప్రభుత్వం మరోసారి నిరూపించి చూపుతుందా?నో డౌట్!
The Cockroach Janta Party movement is stepping up its protests against the central government and…
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలలో తన సత్తా చాటుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఓ గుర్తింపు…