అర్ధరాత్రి అరెస్ట్… అర్ధరాత్రి బెయిల్..!

TDP MLC ashok-babu arrestతెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ను గురువారం అర్ధరాత్రి నాటకీయ పరిణామాల నడుమ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విద్యార్హతలో భాగంగా అశోక్ బాబు బికాం చదవకుండానే ఓ ఫేక్ సర్టిఫికెట్ ను ప్రొడ్యూస్ చేశారని ఆరోపిస్తూ గురువారం అర్ధరాత్రి సమయంలో అర్ధాంతరంగా అరెస్ట్ చేసారు.

ADVERTISEMENT

శుక్రవారం నాడు గుంటూరు సీఐడీ కార్యాలయంలో 17 గంటల పాటు విచారణ చేసి తదుపరి విజయవాడ సీఐడీ కోర్టుకు తరలించారు. సీఐడీ దాఖలు చేసిన సాక్ష్యాలను, పత్రాలను పరిశీలించిన మీదట అశోక్ బాబుకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. దీంతో ఎమ్మెల్సీ అశోక్ బాబుకు పెద్ద ఎత్తున ఉపశమనం లభించినట్లయింది.

అశోక్ బాబు అరెస్ట్ ను ప్రభుత్వం చేయించిన కుట్రగా ప్రతిపక్ష అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పీఆర్సీపై ఉద్యోగస్తులు ఉద్యమిస్తున్న తరుణంలో… వాటిని పక్కదోవ పట్టించేందుకు అశోక్ బాబు అరెస్ట్ కు తెరలేపారన్న భావన సర్వత్రా వినపడుతోంది.

ఇదిలా ఉండగా, అశోక్ బాబుపై వచ్చిన ఫేక్ సర్టిఫికెట్ల ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, వైసీపీలో ఎంతమంది నేతలు ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టుకుని అధికారం రావాలని చలామణి చేస్తున్నారో అంటూ ఒక్కొక్కరి ఫేక్ సర్టిఫికెట్ భాగోతాన్ని బయట పెడుతున్నారు.

ఈ జాబితాలో కరకట్ట కమల్ హాసన్ గా పరిగణించే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి పేరు ప్రముఖంగా హైలైట్ అవుతోంది. అలాగే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విద్యార్హతలపై కూడా ప్రశ్నలు వేస్తూ… ఒక చోట బికాం, మరో చోట ఎంబీఏ ఉందని ఎత్తి చూపిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories