
సాధారణంగా మీడియా ముందుకు రాని టీడీపి ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కూడా మద్యం కుంభకోణం కేసు గురించి మాట్లాడేందుకు వచ్చారంటే కాస్త ఆశ్చర్యంగానే ఉంది. ఈ కేసు గురించి సజ్జల రామకృష్ణా రెడ్డి చేస్తున్న వాదనలని తనదైన శైలిలో విశ్లేషించి అడిగిన కొన్ని సూటి ప్రశ్నలు అందరినీ ఆలోచింపజేస్తాయి.
“వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా సజ్జల ఇదేవిదంగా వాదించారు. ఆ కేసులో న్యాయం కోసం పోరాడుతున్న ఆయన కుమార్తె సునీతే ఆస్తుల కోసం తండ్రిని హత్య చేయించారన్నట్లు మాట్లాడారు. తర్వాత చంద్రబాబు నాయుడు ఆయనని హత్య చేయించారన్నట్లు మాట్లాడారు.
నేను చెప్పినట్లుగా వారిని అనుమానితులుగా పరిగణించి సిబీఐ ఎందుకు విచారణ జరుపలేదని సజ్జల ప్రశ్నించారు. కానీ చంద్రబాబు నాయుడు, సునీతా రెడ్డి నిందితులైతే ఆ కేసు విచారణ సాగనీయకుండా సిబీఐకి జగన్ ఎందుకు అడ్డుపడ్డారు?” అని కలిశెట్టి అప్పలనాయుడు ప్రశ్నించారు.
మద్యం కుంభకోణం కేసు గురించి మాట్లాడుతూ, “ఇప్పుడు ఈ కేసులో కూడా సజ్జల సరిగ్గా అలాగే వాదిస్తున్నారు. ఏపీ బెవరేజస్ కార్పోరేషన్ ఎండీగా వాసుదేవ రెడ్డి మద్యం ఉత్పత్తి, సరఫరాని పర్యవేక్షిస్తున్నప్పుడు సిఎం కార్యాలయం ఎందుకు జోక్యం చేసుకుంది?
మద్యం కొనుగోళ్ళకు ఆన్‌లైన్‌లో ఆటోమేటిక్ ఆర్డర్స్ విధానం (ఓఎఫ్ఎస్)ని పక్కన పెట్టి మాన్యువల్ విధానం అనుసరించాలని సిఎం కార్యాలయం వాసుదేవరెడ్డిని ఎందుకు ఆదేశించింది?
నగదు రహిత విధానం అందుబాటులో ఉండగా కేవలం నగదుతోనే లిక్కర్ అమ్మకాలు ఎందుకు చేసినట్లు? ఈ కేసులో సహా నిందితుడు విజయసాయి రెడ్డి స్వయంగా మద్యం కుంభకోణం ప్లానింగ్ గురించి పూస గుచ్చినట్లు వివరిస్తే ఎటువంటి అవినీతి జరుగలేదని ఎలా వాదిస్తున్నారు?అయినా ఈ కేసు గీసు లేదని వాదిస్తున్నప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ కాగానే అందరూ భయంతో ఎందుకు వణికిపోతున్నారు సజ్జల రామకృష్ణా రెడ్డి?” అని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రశ్నించారు.
కనుక ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చెప్పినట్లుగా వైసీపీ నేతలందరూ కలిసికట్టుగా గట్టిగా బుకాయిస్తూ ఇదో భూటకపుకేసని, తామందరం చంద్రబాబు నాయుడు బాదితులమని ప్రజలను నమ్మించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు అర్ధమవుతోంది.
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…