
టిడిపి ఎప్పుడూ నేతలకంటే కార్యకర్తలనే ఎక్కువగా నమ్ముకొంటుంది. కనుక జైల్లో ఉన్న తమ పార్టీ కార్యకర్తలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పేందుకు టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మంగళవారం మధ్యాహ్నం 1.45 గంటలకు తిరుపతి చేరుకొన్నారు. టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నేత యువరాజుల నాయుడు, మండల కన్వీనర్ దొరబాబు చౌదరి, చిత్తూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి గంగారపు గోపీలు ఆయనకు స్వాగతం పలికారు. నారా లోకేష్ వస్తున్న సంగతి తెలుసుకొని వందలాది మంది టిడిపి కార్యకర్తలు రేణిగుంట విమానాశ్రయం వద్దకు చేరుకొని ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.
టిడిపి కార్యకర్తలు వెంట కదిలిగా నారా లోకేష్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుపతిలోని జైలుకి చేరుకొని అక్కడ మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, ఇతర టిడిపి నేతలు, కార్యకర్తలను పరామర్శించారు. ఆ తర్వాత పూతలపట్టు మండలంలోని వేపపల్లెకు వెళ్ళి జైలులో ఉన్న వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెపుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి కారులో చంద్రగిరి చేరుకొని, ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన టిడిపి కార్యకర్తలు భానుప్రకాశ్ రెడ్డి, గంగపల్లి భాస్కర్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెపుతారు. పార్టీ కార్యకర్తలకు సమస్య ఎదురైతే నారా లోకేష్ తక్షణం రావడంపై టిడిపి నేతలు, కార్యకర్తలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Watch and subscribe for Exclusive Interviews:
Naazukmadanlochan brings a breezy dose of beachside glamour to this striking black beachwear showcase. Her…
The second film is often where the real test begins for a young director. A…