టీడీపీకి కొత్త కార్యాలయం కలిసొచ్చేన్నా?

TDP new officeఇటీవలే జరిగిన ఎన్నికలలో టీడీపీ అధికారం కోల్పోయింది. తన చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా 23 ఎమ్మెల్యేలకు, 3 ఎంపీలకు పడిపోయింది. టీడీపీని కబళించడానికి ఒక పక్క జగన్, మరోపక్క మోడీ చేస్తుండడంతో తెలుగుదేశం పార్టీకి ఇది పరీక్షా కాలం అనే చెప్పుకోవాలి. పైగా లోకేష్ ఓటమితో చంద్రబాబు తరువాత ఎవరు అనే ప్రశ్న కూడా వేధిస్తుంది.

ADVERTISEMENT

ఈ క్రమంలో ఆ పార్టీ కొత్త కార్యాలయంలోకి అడుగుపెట్టబోతుంది. మంగళగిరి సమీపంలో తెలుగుదేశం పార్టీ నూతనంగా నిర్మిస్తున్న రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. నవంబరు 3 తేదీ, ఆదివారం గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆరోజు సాయంత్రం 7.19 నిమిషాలకు ముహూర్తం నిర్ణయించారు.

గృహ ప్రవేశం చేసిన మర్నాటి నుంచి అందులోనే కూర్చుని రోజువారీ కార్యకలాపాలు నిర్వహించాలన్న లక్ష్యంతో చంద్రబాబు ఉన్నారు. ప్రస్తుతం చంద్రబాబు తన ఇంటిలోనే ఎక్కువగా సమావేశాలు పెడుతున్నారు. ప్రభుత్వం ప్రజావేదిక తన వాడకానికి ఇస్తుందని ఆశించినా దానిని నేలమట్టం చేసి జగన్ తన పగ తీర్చుకున్నారు. మరోపక్క చంద్రబాబు ఉంటున్న ఇంటిని కూడా పడగొట్టే పనిలో పడ్డారు.

లోకేష్ ఎక్కడైతే తన మొదటి ఎన్నికలలో ఓడిపోయాడో అక్కడే పార్టీ కార్యాలయం ఏర్పాటు అవుతుండడం విశేషం. ఈ కొత్త కార్యాలయం కలిసొచ్చి రానున్న స్థానిక ఎన్నికలలో మెరుగైన ఫలితాలు వస్తాయని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ నుండే పార్టీలో సమూల ప్రక్షాళన చేసి, స్థానిక ఎన్నికలకు ప్రణాళికలు సిద్ధం చెయ్యనున్నారు చంద్రబాబు.

ADVERTISEMENT
Latest Stories