Telugu

టీడీపీ చరిత్ర…ఒక నిఘంటువు.?

ఒక్క వివాదంతో 25 ఏళ్ళ బిఆర్ఎస్ అనుభవం మూగబోయింది, ఒక్క విభేదంతో 40 ఏళ్ళ అన్నా చెల్లెళ్ళ అనుబంధం ముక్కలయ్యింది. అయితే ఇటువంటి రాజకీయ వివాదాలు, అటువంటి కుటుంబ విభేదాలు ఎన్నో టీడీపీ జెండా మాటున కనుమరుగయిపోయాయి.

నాడు నందమూరి తారక రామారావు చేతుల మీద స్థాపించబడిన తెలుగు దేశం పార్టీ నేడు నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలో ముందుకెళ్తున్నది. ఈ నందమూరి, నారా మధ్య టీడీపీ పార్టీ ఎన్నో రాజకీయ వివాదాలను, మరెన్నో రాజకీయ సంక్షోభాలను మోసింది.

ADVERTISEMENT

నాడు నాదెండ్ల భాస్కరరావు వివాదం నుంచి మొదలుపెడితే లక్ష్మి పార్వతి విభేదాల వరకు, నాడు రాష్ట్ర విభజన నుంచి నేడు బాబు అరెస్టు వరకు టీడీపీ పార్టీలో ఎన్నో రాజకీయ సంక్షోభాలను చూసింది. అయితే వాటిలో వేటికి టీడీపీ జెండా తలవంచలేదు. ఎన్నడూ తెలుగు దేశ నాయకత్వం మూగబోలేదు. అలాగని హద్దులు దాటిన విమర్శలతో సొంతవారి పై దిగజారుడు విమర్శలు గుప్పించలేదు.

కాలమే బదులు చెపుతుంది అంటూ పార్టీ పటిష్టత పై ద్రుష్టి పెట్టారు. ఎన్టీఆర్ చేతుల నుంచి బాబు నాయకత్వంలోకి టీడీపీ జెండా అనేది నందమూరి కుటుంబసభ్యుల ఆమోదంతో జరిగింది. ఈ కుటుంబం నుంచి ఏ ఒక్కరు కూడా నారా నాయకత్వాన్ని వ్యతిరేకించలేదు. అయితే ఇన్ని వివాదాల మధ్య కూడా కుటుంబ సభ్యుల సహకారంతో ప్రజల మద్దతుతో టీడీపీ జెండాను అధికారంలోకి తెచ్చారు బాబు.

అలాగే ఎన్టీఆర్ వారసురాలైన పురందరేశ్వరి తండ్రి పెట్టిన పార్టీని కాదని కాంగ్రెస్ లో చేరినా, ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ అన్న తెలుగు దేశం అంటూ బయటికెళ్లినా అవి వారి వ్యక్తిగత నిర్ణయాలు అంటూ వాటికి గౌరవమిచ్చారే కానీ వైసీపీ మాదిరి పురందరేశ్వరి పై, కానీ హరికృష్ణ పై కానీ టీడీపీ ఎన్నడూ కత్తులు దూయలేదు.

అలాగే తొమ్మిదేళ్ల ముఖ్యమంత్రి హోదా తో దేశంలోనే ప్రముఖ నాయకుడిగా ఎదిగిన బాబు ఆ తరువాత పదేళ్లు ప్రతిపక్షానికే పరిమితమైన ఎన్నడూ ప్రజా క్షేత్రానికి దూరమవ్వలేదు, ఓటమికి కుంగిపోలేదు. కానీ ఇప్పుడు కేసీఆర్ పదేళ్ల బిఆర్ఎస్ అధికారం చేజారగానే పార్టీ నాయకులకే కాదు రాష్ట్ర ప్రజలకు సైతం ముఖం చాటేస్తున్నారు.

అలాగే తన సొంత కుటుంబంలో వచ్చిన విభేదాలతో పార్టీలో నానా రచ్చ జరుగుతున్నా కేసీఆర్ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతున్నారే కానీ పార్టీ బలోపేతానికి అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. ఒక్క ఓటమి, ఒక్క వివాదం 25 ఏళ్ళ బిఆర్ఎస్ ప్రస్థానాన్ని ప్రశ్నించే స్థాయికి వచ్చింది.

ఇక వైసీపీలో అన్నా చేల్లిల్ల మధ్య రాచుకున్న చిచ్చు చిలికి చిలికి పుట్టుకులనే ప్రశ్నించే స్థాయికి దిగజారింది. కానీ నందమూరి కుటుంబం మొత్తం విభేదించిన లక్ష్మి పార్వతి వివాదం విషయంలో టీడీపీ ఎన్నడూ హద్దులు దాటి ప్రవర్తించింది లేదు. లక్ష్మి పార్వతి ఇప్పటికి బాబు పై విషం చిమ్ముతున్న బాబు ఏనాడు ఆడవారిని అగౌరవపరిచే రాజకీయాన్ని ప్రోత్సహించిందే లేదు.

బాబు కు ఉన్న ఆ రాజకీయ విలువలే లక్ష్మి పార్వతి నోటికి ఇప్పటికి తాళం వెయ్యలేకపోతుంది. కానీ జగన్ తన సొంత చెల్లెళ్ళ పైనే సొంత మీడియాలో వారి జీవితాల పై వ్యక్తిత్వ హననం చేస్తూ కథనాలు ప్రచారం చేసారు. ఇక సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి వైవాహిక జీవితాన్ని సైతం మీడియాకెక్కించారు. ఆయన కుమార్తె, అల్లుడు పై హత్యారోపణలు చేస్తూ వారిని రాష్ట్రంలోకి అడుగుపెట్టనివ్వకుండా చేసారు.

ఇక గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో బాబు తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడని చీకటి రోజులను చూసారు, ఎన్నడూ వినని రాజకీయ విమర్శలను విన్నారు. అయినా తిరిగి అధికారంలోకి వచ్చాకా జగన్ మాదిరి కక్ష్య రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా రాష్ట్ర ప్రగతి పై ద్రుష్టి పెట్టారు.

ఈ అన్ని అంశాలలో కూడా టీడీపీ రాజకీయాలకు…వ్యక్తిగత బంధాలకు, ప్రభుత్వానికి…పార్టీకి మధ్య ఉన్న అంతరాన్ని స్పష్టంగా చూపిస్తూ ఎక్కడ తగ్గాలో, ఎక్కడ పట్టుకోవాలో, ఎక్కడ వదిలేయాలో అన్న విషయాలలో ఇప్పటి రాజకీయ పార్టీలకు టీడీపీ చరిత్ర ఒక నిఘంటువు అనేలా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Married Heroines & Intimate Scenes: Double Standards?

For decades, marriage was almost treated like a full stop in the careers of Indian…

26 minutes ago

Pics: Mahira Gives Black Fashion A Playful Twist!

Mahira Sharma gives the all black trend a fresh, flirtatious spin with a fitted crop…

47 minutes ago