
ఈ 5 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, వైసీపి ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు టిడిపిని ఎంతగానో అవహేళన చేశారు. ముఖ్యంగా గత ఎన్నికలలో టిడిపి యువనేత నారా లోకేష్ని వ్యక్తిగతంగా ఎంతగానో కించపరిచారు.
కానీ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, టిడిపి నేతలు నిబ్బరం కోల్పోకుండా చాలా సంయమనం పాటిస్తూ 5 ఏళ్ళు గడిపి ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలలో వారందరినీ ఓటమి అంచున నిలబెట్టారు.
టిడిపి సానుభూతిపరులు కూడా ఇప్పుడు వైసీపితో సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకుంటున్నారు. రేపు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతవైసీపి ఓటమి, కూటమి గెలుపు గురించి సాక్షిలో ఏవిదంగా కధనం వస్తుందో ఊహించి వ్రాసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది.
“వెంట్రుకవాసిలో అధికారం చేజారిన వైసీపి…. రాష్ట్ర వ్యాప్తంగా 13 ఎమ్మెల్యే సీట్లలో విజయ దుందుభి మోగించిన వైసీపి… రెండు లోక్సభ స్థానాలలో చారిత్రిక విజయం సాధించిన వైసీపి… బొటాబోటి మెజార్టీతో 162 స్థానాలలో మాత్రమే విజయం సాధించిన టిడిపి+జనసేన కూటమి… అతికష్టంతో 23 ఎంపీ స్థానాలు గెలిచిన టిడిపి కూటమి… దేశ ప్రజలు, రాజకీయ ప్రముఖులు ఈ ఫలితాలు చూసి గగ్గోలు పెడుతున్న ప్రపంచదేశాధి నేతలు… తీవ్ర విషాదంలో కోట్లాది మంది రాష్ట్ర ప్రజలు… టిడిపి గెలుపు రాష్ట్రానికి అరిష్టమంటున్న మేధావులు… పక్క రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి తెచ్చిన ఓటర్లతో దొంగ ఓట్లు వేయించిన టిడిపి+జనసేన కూటమి…” అని దాని సారాంశం.
ఇప్పటికే ఓటమికి మానసికంగా సిద్దపడిపోయి, కేంద్రాన్ని, కేంద్ర ఎన్నికల కమీషన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని, పోలీసులను నిందిస్తున్నారు. కనుక ఓడిపోతే తమ ఓటమిని, కూటమి గెలుపుని ఈవిదంగానే సాక్షి చెప్పుకునే అవకాశం ఉంది.
Mrunal Thakur has not signed a new film in nearly nine months. However, it is…
Mumbai Indians have reportedly shut down rumours of Rohit Sharma returning as captain for IPL…