Telugu

కండువాలున్నాయా… ఉంటే మేము వచ్చేస్తాం!

ఆంధ్రాలో ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో కొంతమంది వైసీపి ఎమ్మెల్యేలు, ఎంపీలు టిడిపిలో చేరిపోయారు. అది సహజం.

చంద్రబాబు నాయుడు లేదా పవన్‌ కళ్యాణ్‌ గ్రీన్ సిగ్నల్‌ ఇస్తే మరికొంత మంది వచ్చేసేందుకు నేటికీ ఎదురుచూస్తున్నారు. కానీ రెండు పార్టీలు ఇప్పటికే హౌస్ ఫుల్ అయిపోయి ఉన్నాయి. కనుక ఏ సిగ్నల్ ఇవ్వడం లేదు.

ADVERTISEMENT

కానీ వైసీపి అధీనంలో ఉన్న విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ పీఠాన్ని దక్కించుకోవాలంటే కొంతమందికి గ్రీన్ సిగ్నల్‌ ఇవ్వక తప్పదు కనుక టిడిపి ఇచ్చేసింది.

జీవీఎంసీలో వైసీపికి మొత్తం 58 మంది కార్పొరేటర్లున్నారు. టిడిపి, జనసేనలు గేట్లు తెరిస్తే వారందరూ వచ్చేయడానికి సిద్దంగానే ఉన్నారు. కానీ మొదటి విడతలో 20 మంది కార్పొరేటర్లకు మాత్రమే గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిన్నట్లు సమాచారం.

ఈ విషయం తెలియగానే శనివారం జీవీఎంసీ కార్యాలయంలో సమావేశానికి వైసీపి కార్పొరేటర్లు అందరూ హాజరుకావాలని గుడివాడ అమర్నాధ్ హుకుం జారీ చేశారు. కానీ 58 మందిలో 42 మంది మాత్రమే వచ్చారు. మిగిలిన 16 మంది ఓ స్టార్ హోటల్లో రహస్యంగా సమావేశమయ్యారు. అంటే వారు వైసీపి చేజారిపోయిన్నట్లే భావించవచ్చు.

కానీ సమావేశానికి వచ్చిన కార్పొరేటర్లు కూడా పార్టీ అధిష్టానం తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నంతకాలం తమని పురుగుల్లా చూశారని, ఇప్పుడు మా అవసరం వచ్చిందా? అంటూ నిలదీశారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రా ఇన్‌చార్జిలుగా వ్యవహరించిన విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డిలు తమను చాలా చులకనగా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు.

నాడు రోజా, అంబటి రాంబాబు, కొడాలి నాని వంటివారు చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లని ఉద్దేశ్యించి చులకనగా మాట్లాడేవారని, కానీ సొంత పార్టీ కార్పొరేటర్లమైన తమను కూడా అదేవిదంగానే ట్రీట్ చేయడాన్ని నేటికీ సహించలేకపోతున్నామని వారు స్పష్టం చేశారు.

గుడివాడ అమర్నాథ్ వారికి ఎంతగా నచ్చజెప్పినప్పటికీ వారు ఎదురు ప్రశ్నలు వేశారే తప్ప ఎవరూ ఆయన మాట వినలేదు. కనుక టిడిపి, జనసేనలు కండువాలు సిద్దం చేసుకుంటే వచ్చేయడానికి వారు సిద్దంగానే ఉన్నారనుకోవచ్చు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

స్థానికంలో మచ్చుకి కొన్ని ఆలోచనలు, అభిప్రాయాలు…

స్థానిక సంస్థల ఎన్నికలలో సీట్ల సర్దుబాట్ల విషయంలో సోషల్ మీడియాలో ఇరు వర్గాల మద్దతుదారులు చేస్తున్న వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా…

22 minutes ago

దసరాకు కాదు.. సంక్రాంతికి రిలీజ్‌!

ఇది సినిమా రిలీజ్‌.. వాయిదా పడటం గురించి కాదు. మాజీ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కొత్త పార్టీ రిలీజ్‌…

22 minutes ago