Telugu

వైసీపీ బాటలో టీడీపి వెళ్తే…

వైసీపీ రాజకీయాలు ఎలా ఉంటాయో అందరూ అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. వైసీపీ 2.0 వెర్షన్ మరింత ‘హార్డ్’ ఉంటుందని కూడా జనం అర్థం చేసుకుంటున్నారు. వైసీపీ వైఖరి ఈవిధంగా ఉన్నందునే ప్రజలు 175కి కోత పెట్టి 11తో సరిపెట్టారు.

కనుక కూటమి ప్రభుత్వం ముఖ్యంగా టీడీపి.. ఏవిషయంలో కూడా వైసీపీ విధానాలను అనుకరించే ప్రయత్నం చేయకూడదు. చేస్తే చరిత్ర పునరావృతమవుతుందని మరిచిపోకూడదు.

ADVERTISEMENT

నేడు పల్నాడులోని పిడుగురాళ్ళలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద “మహా పాపం నిజం. టిటిడీలో 68.17లక్షల కిలోల కల్తీ నెయ్యి… అది నెయ్యే కాదు,” అంటూ జగన్‌, భూమన కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఫోటోలతో పెద్ద ఫ్లెక్సీ బ్యానర్‌ వెలిసింది.

దీంతో టీడీపికి ప్రత్యక్షంగా సంబంధం లేకపోవచ్చు. కానీ ఇవి టీడీపి చేస్తున్న ఆరోపణలే. కనుక టీడీపి నేతలే ఇది పెట్టించి ఉండవచ్చని ప్రజలు భావించడం సహజం. అయితే ఈ ఫ్లెక్సీ బ్యానర్ ద్వారా టీడీపి ఆశిస్తున్నట్లు ప్రజలను ఆలోచింపజేయవచ్చు.

కానీ ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు, ఈవిధంగా వైసీపీ హయంలో టిటిడీలో కల్తీ నెయ్యి వాడారంటూ ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టడంపై వైసీపీ కోర్టులో పిటిషన్‌ వేస్తే ఏమవుతుందో ఆలోచించుకుంటే ఈవిధంగా చేసి ఉండరు. కోర్టు తీర్పు చెప్పక ముందే వైసీపీని దోషిగా నిర్ధారిస్తూ ఫ్లెక్సీ బ్యానర్లు పెడితే కోర్టు ఏవిధంగా స్పందిస్తుందో గ్రహిస్తే మంచిది.

ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, ముఖ్యంగా అమరావతి, పోలవరం, కొత్త రోడ్లు, ఫ్లై ఓవర్ల నిర్మాణ పనుల గురించి ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టి ప్రజలకు తెలియజేస్తే అందరూ సంతోషిస్తారు.

రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీల గురించి తెలియజేస్తే సంతోషిస్తారు. రాష్ట్రాభివృద్ధి ప్రభుత్వం అమలుచేస్తున్న సరి కొత్త విధానాల గురించి రాష్ట్ర ప్రజలందరికీ ఎప్పటికప్పుడు తెలియజేసినా చాలా సంతోషిస్తారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలుసుకోగలుగుతారు. కానీ వాటి గురించి టీడీపి పెద్దగా చెప్పుకోదు.

కానీ వైసీపీని అనుకరిస్తూ ఇలా ‘ఫ్లెక్సీ బ్యానర్ యుద్ధాలు’ మొదలు పెట్టింది. వాటి ద్వారా దానికి లభించే రాజకీయ ప్రయోజనం కంటే, ఈవిధంగా అనవసరమైన చర్చలు మొదలవుతాయి.

ఫ్లెక్సీ బ్యానర్ల యుద్ధంలో వైసీపీది అందెవేసిన చేయి. ఒకవేళ అది కూడా దీనికి బదులుగా ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టడం మొదలుపెడితే టీడీపి తట్టుకోగలదా? ఆలోచిస్తే మంచిది.

ముఖ్యంగా ఈ విషయంలో వైసీపీని అనుకరిస్తే టీడీపికి ఒరిగేదేమీ ఉండదు కానీ పరువు పోతుంది. ఎందుకంటే టీడీపి కూడా వైసీపీ స్థాయికి దిగజారిందని ప్రజలు భావించకుండా ఉంటారా?కనుక ఇటువంటి చవుకబారు రాజకీయాలకు టీడీపి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Trivikram’s God of War: NTR Fans Panic After AK47 Fiasco

NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…

4 hours ago

IND vs WI T20: Sarpanch Destroys WI! Nightmare Begins?

Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…

4 hours ago