
2024 జూన్ లో టీ-20 వరల్డ్ కప్ ను ఒడిసిపట్టాకా, భారత అభిమానుల మరియు ఆటగాళ్ల కాన్ఫిడెన్స్ తార స్థాయి కి వెళ్లాయి. అయితే, టీ-20 ప్రపంచ కప్ తరువాత టెస్ట్ ట్రోఫీ ని కూడా భారత్ కైవసం చేసుకుంటుందని ఖాయమైపోయారు అభిమానులు. అందుకు ఫైనల్ చేరేందుకు కూడా మిగతా జట్లన్నిటితో పోల్చుకుంటే, భారత్ కే మార్గం సులువుగా ఉండేది.
ఇదంతా న్యూజిలాండ్ భారత గడ్డ మీద అడుగు పెట్టక పూర్వం. ఎవ్వరూ ఊహించని విధంగా, న్యూజీలాండ్ టీం భారత్ వచ్చి తొలిసారి సిరీస్ కైవసం చేసుకొటమే కాక, ఏకంగా భారత్ ను సొంత గడ్డ పైనే వైట్ వాష్ చేసి, భారత అభిమానులనే కాదు ప్రపంచాన్నే ఆశ్చర్య పరిచారు. అయితే, టెస్ట్ ఫార్మాట్ లో ఇక భారత్ పని అయిపోయిందని, గంభీర్ కోచింగ్ లో భారత్ ఇక ఫామ్ లోకి రాదని ఎందరో ఎన్నో విమర్శలు చేసారు.
మరి ముఖ్యంగా భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ ను టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటికిన్చేయమని ఎందరో ట్వీట్లు వేశారు. ఇంతటి ఘోర అనుభవం తరువాత, ఆసీస్ తో ఆస్ట్రేలియా సిరీస్ ఆడాల్సిన భారత్ పై విపరీతమైన ట్రోల్ల్స్ తో పాటు ఒత్తిడి వచ్చింది. 0 -5 తో ఆసీస్ సిరీస్ ను కైవసం చేసుకుంటుందని అని అన్నవారూ లేకపోలేరు.
అయితే, ఈ అవమానాలన్నిటికి, భారత జట్టు నోటితో కాకుండా తమ ఆటతోనే సమాధానం ఇచ్చారు. ఆటలో కమ్-బ్యాక్ ఇవ్వటం తమకు కొత్తేమి కాదు అని మరోసారి నిరూపించుకున్నారు టీం ఇండియా. ఆఖరికి, ఆస్ట్రేలియా vs ఇండియా మొదటి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో సైతం భారత బ్యాటర్లు 150 పరుగులకే ఆల్ అవుట్ అయ్యి నిరాశపరిచారు.
ఇక, ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో మొదలయిన భారత తిరుగుబాటు, పోను పోనూ ఒక దండయాత్ర గా రూపాంతరం చెందింది. ఆసీస్ ను కేవలం 104 పరుగులకే ఆల్ అవుట్ చేయటమే కాక రెండవ ఇన్నింగ్స్ లో ఏకంగా 487 పరుగులతో ఆసీస్ ను ముప్పు తిప్పలు పెట్టారు. యంగ్ సంచలం యశస్వి మరొక సెంచరీతో చెలరేగాడు,161 పరుగులు చేసాడు.
భీకరమైన ట్రోలింగ్ ను ఎదుర్కున్న విరాట్ కోహ్లీ మరోసారి తన స్థాయి, తన ఆటతీరు లోని కమ్మదనాన్ని భారత అభిమానులందరికి రుచి చూపించారు. 81 వసెంచరీతో చెలరేగి తన క్రికెట్ లో తన స్థాయి వేరు టీం లో తన స్థానం వేరు అని మరోసారి రుజువు చేసుకుని ఆసీస్ జట్టు ముందు 534 పరుగుల భారీ టార్గెట్ ఉంచారు.
ఈ భారీ టార్గెట్ ను ఛేదించే దిశగా మైదానంలో అడుగుపెట్టిన ఆసీస్ టీం భారత బౌలింగ్ దళం ముందు నిలవలేక ఇంకా ఒక రోజు ఆట మిగులుండగానే ఆలౌట్ అయ్యి భారత్ జట్టుకు ఏ సిరీస్ లో తోలి విజయాన్ని అందించారు.
సొంత గడ్డ పై 0 -3 తో ఘోరమైన సిరీస్ వైఫల్యాన్ని చూసి, సొంత అభిమానుల చేత ట్రోలింగ్ కు గురియై, ఆస్ట్రేలియా వచ్చి మరలా మొదటి ఇన్నింగ్స్ లో 150 కే పెవిలియన్ బాట పట్టిన జట్టు, మూడు రోజుల తరువాత, అదే ఆస్ట్రేలియా లో ఆస్ట్రేలియా ను 295 పరుగుల తేడాతో ఓడించి అత్యంత భారీ విజయాన్ని పొందగలిగారు. దీనితో ‘ఇదయ్యా మీ అసలా రూపం’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…
An Indian F-1 student finds herself in serious trouble. A misunderstanding at Walmart has left…