
తాజాగా ముగిసిన టి-20 ప్రపంచ కప్ ను అందుకున్న టీం ఇండియా, పోస్ట్ మ్యాచ్ మాటల్లో టీం దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మరియు రవీంద్ర జడేజా.. పొట్టి ఫార్మటు నుండి ఇక వారు రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారు. ఇంకా ఆ వార్తను జీర్ణించుకోలేకపోతున్న ఫాన్స్ కు అప్పుడే ఒక ఎదురు దెబ్బ తాకింది. వరల్డ్ కప్ ముగిసిన వెంటనే, భారత్ కు జింబాంబ్వే జట్టు తో 5 టి-20 లు ఆడాల్సి ఉంది.
అయితే ప్రపంచ కప్ వంటి పెద్ద పర్యటన తరువాత ఆటగాళ్లకు విశ్రాంతి దొరికేలా, జింబాంబ్వే సిరీస్ కు జట్టు మొత్తాన్ని యువకులతో నింపేశారు. నిన్న ముగిసిన తొలి టి-20 లో భారత్ 13 పరుగుల తేడాతో జింబాంబ్వే తో ఓటమి పాలయింది. ఇక ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా వారు అనుకున్నది కామెంట్స్ చేస్తుండగా, ఎక్కువ మంది విరాట్ మరియు రోహిత్ లేకపోయినా లోటు టీం లో అచ్చుగుద్దినట్టు కనిపిస్తుంది అంటున్నారు.
ఇక శుబ్మాన్ గిల్ సారధిగా వ్యవహిరిస్తున్న ఈ సిరీస్ లో,భారత్ తరుపున సీనియర్ ఆటగాడిగా కూడా ఈ 24 ఏళ్ళ యువకుడే కనిపిస్తున్నాడు. అయితే ఇప్పుడే రూపుదిద్దుకుంటున్న టీం ను అప్పుడే విమర్శలు చేయటం సమము కాదు అని కొందరు, వారికి కొంత సమయం ఇస్తే వారే తమకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు అంటూ కొందరు వారికి సమర్థిస్తున్నారు.
అలాగే రిటైర్ అయిన ముగ్గురూ..టీం లో ఎంతో కీలకమైన వారు కావటం, టీం అంత యువకుల తో నిండడం ఇలా ఈ ఓటమికి అనేక కారణాలున్నాయి. విరాట్ కోహ్లీ, కేవలం బాట్స్మన్ గానే కాక ఫీల్డింగ్ సమయం లో తాను టీం కు ఇచ్చే ఉత్సాహం అంతా ఇంతా కాదు.రోహిత్, బాట్స్మన్ గానే కాక కెప్టెన్ గా టీం కు ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
రవీంద్ర జడేజా, కేవలం ఒక బాట్స్మన్ లేదా ఒక బౌలర్ గానే కాక, తన అల్ రౌండ్ విశిష్ఠతో పాటు ఫీల్డింగ్ సమయం లో ఔరా అనేలా తన ఫీల్డింగ్ నైపుణ్యం తో కట్టిపడేస్తాడు. ఇలా అన్ని రంగాల్లోనూ ప్రావిణ్యత ఉన్న ఆటగాళ్లు రిటైర్ అవ్వటంతో యువకులకు కాస్త సమయం ఇచ్చి చూడాలి అనేది భావ్యం. చూడాలి మరి నేడు జరిగే రెండవ మ్యాచ్ లో అయిన యువకులు కమ్ బ్యాక్ చేసి విమర్శలకు ఆటతీరుతోనే సమాధానం ఇస్తారని ఆశిద్దాం.
Mrunal Thakur has not signed a new film in nearly nine months. However, it is…
Mumbai Indians have reportedly shut down rumours of Rohit Sharma returning as captain for IPL…