
అనంతరం రెండవ ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా 39 ఓవర్లలో 157 పరుగులు చేసి మొత్తం 285 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఓపెనర్ రాహుల్ 28, శిఖర్ ధావన్ 26, కోహ్లి 4 పరుగులకు అవుట్ కాగా, రెహనే 51, రోహిత్స్ శర్మ 41 పరుగులతో క్రీజులో ఉన్నారు. చేతిలో 7 వికెట్లు ఉన్నప్పటికీ, ఆటలో ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. దీంతో వీలైనంత త్వరగా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి, విండీస్ ను ఆలౌట్ చేస్తే భారత్ కు విజయావకాశాలు ఉంటాయి.
ఇప్పటికే 285 పరుగుల ఆధిక్యంలో ఉండగా, మరో 50 పరుగులైతే ఖచ్చితంగా టీమిండియా జోడించి డిక్లేర్ చేస్తుంది. అంటే చివరి రోజు 300కు పైగా పరుగులు విండీస్ చేధించాల్సి ఉంటుంది. ఇది సాధ్యమయ్యే విషయం కాదు. దీంతో మ్యాచ్ డ్రా దిశగా సాగుతుందా? లేక టీమిండియా సొంతం చేసుకుంటుందా? అన్న దానిపైనే ఆసక్తి నెలకొంది.
The motion poster of Chandrayan has been unveiled, giving audiences a glimpse into a wildly…
Chennai Super Kings have been asked to consider a change in captaincy before IPL 2027,…