
తెలంగాణలో మరోకొత్త పార్టీ ఆవిర్భవించబోతున్నట్టు సంకేతాలు ఇస్తున్నారు తీన్మార్ మల్లన్న. తెలంగాణ రాష్ట్రానికి బీసీ నినాదంతో కుల రాజకీయాలను పరిచయం చేసిన తీన్మార్ ఇప్పుడు తెలంగాణకు ప్రత్యేకంగా ఒక బీసీ పార్టీని తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు.
ఇప్పటికే బిఆర్ఎస్ కు దూరంగా కవిత జాగృతి అంటూ సొంత రాజకీయానికి రెడీ అయిన ఈ తరుణంలో ఇక ఇప్పుడు మల్లన్న బీసీ పార్టీ అంటూ ముందుకు రావడంతో తీన్మార్ రాజకీయం వెనుకున్న ఆ మర్మమేమిటో అన్న సందేహాలు మొదలయ్యాయి.
అయితే గతంలో కాంగ్రెస్ నేతగా ఉన్న మల్లన్న తన బీసీ నినాదాలతో, పార్టీ నాయకత్వపు నిర్ణయాల విమర్శలతో పార్టీ నుండి బయటకు పంబడ్డారు. అయితే శత్రువు కి శత్రువు మిత్రుడవుతాడు అన్న నానుడి మాదిరి కాంగ్రెస్ కు విరోధిగా మారిన మల్లన్న బిఆర్ఎస్ కు దగ్గరయ్యారు అనే ప్రచారం సాగింది.
ఆ బలమే తీన్మార్ ను కవిత పై అనుచిత వ్యాఖ్యలు చేసేలా పురిగొల్పాయి అనే వాదన నడిచింది. ఆ వాదనకు మరింత బలాన్ని ఇచ్చేలా కవిత పై మల్లన్న చేసిన వ్యాఖ్యలకు గాను బిఆర్ఎస్ సైలెన్స్ ను పాటించింది, కేసీఆర్ కుటుంబం పట్టీపట్టనట్టు గమ్మున చూస్తూ ఉండిపోయింది.
కవిత కూడా తీన్మార్ దుస్సాహసం వెనుక బిఆర్ఎస్ ముఖ్య నాయకుల హస్తం ఉందంటూ ఆరోపణలు గుప్పించారు. ఇటువంటి తరుణంలో మల్లన్న బీసీల కోసం త్వరలో ఒక కొత్త పార్టీ ప్రారభించబోతున్నాను అంటూ ప్రకటించడంతో ఈ రాజకీయ పార్టీ వెనుక గులాబీ కారు ప్రయాణం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రానున్న సార్వత్రిక ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేకతను చీల్చడానికి, బీసీ ల రూపంలో వచ్చే సానుకూలతను కాంగ్రెస్ గూటికి చేరకుండా ఉండడానికి తీన్మార్ తో గులాబీ బాస్ తెర వెనుక రాజకీయం మొదలుపెట్టారా.? అందులో భాగంగానే ముఖ్యమంత్రి, మంత్రులు, మున్సిపల్ చైర్మన్ పదవులలో బీసీ లు అనే నినాదంతో మల్లన్న తెలంగాణలో తీన్మార్ రాజకీయం మొదలుపెట్టబోతున్నారు.
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…