
Telangana Congress leaders face scrutiny
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య బయటపడుతున్న అంతర్గత విభేదాలు ఆ పార్టీ అధిష్ఠానానికి పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. ఒకపక్క సీఎంగా రేవంత్ రెడ్డిని పూర్తి స్థాయిలో విశ్వసిస్తూ ఆయనకు అనుకూలంగా ముందుకెళ్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం కొందరి విషయంలో మాత్రం వెనకడుగు వేస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
దశాబ్దాల పాటు కాంగ్రెస్ జెండా మోసిన సీనియర్ నాయకుల విషయంలో కూడా వెనక్కి తగ్గని కాంగ్రెస్ అధిష్ఠానం కోమటిరెడ్డి విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నట్లు అన్న ప్రశ్న రేవంత్ అభిమానులను తొలిచేస్తుంది. కాంగ్రెస్ మోస్ట్ సీనియర్ నేతగా గుర్తింపు ఉన్న జీవన్ రెడ్డి విషయంలో మరో ఆలోచన లేకుండా,
కొండా సురేఖ విషయంలో ప్రత్యామ్నాయం ఆలోచించకుండా చర్యలు తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం కోమటిరెడ్డి రాజగోపాల్ విషయంలో మాత్రం ఎందుకు ఆలోచనలో పడుతుంది? తనకు మంత్రి పదవి రాలేదు అనే ఆక్రోశానికి తోడు అందుకు సీఎం రేవంత్ రెడ్డే కారణం అనే ఆవేశం కూడా కోమటిరెడ్డి ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదా?
తన నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదని, తనకు మంత్రి పదవి రావడం లేదని, ప్రభుత్వ శాఖల్లో అవినీతి జరుగుతోందని… ఇలా ఏదో ఒక కారణంతో రాజగోపాల్ సీఎం రేవంత్ టార్గెట్ గా బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. అయినా కూడా రాజగోపాల్ మీద పార్టీ క్రమశిక్షణ చర్యలు మాత్రం శూన్యమనే చెప్పాలి.
గతంలో మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత సీఎం రేవంత్, ఆయన సోదరుడు కేంద్రంగా అవినీతి ఆరోపణలు చేశారు, అలాగే సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు గుప్పించారు. అయితే సుస్మిత చేసిన కామెంట్స్ ను మంత్రిగా ఉన్న కొండా సురేఖ ఖండించలేదని, తన కుమార్తె ఆరోపణల పై సురేఖ మౌనం పాటించారని ఆమె పై కాంగ్రెస్ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసి మంత్రి పదవి నుంచి తొలగించారు.
అయితే నాడు కొండా సురేఖ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం కనబరిచిన సత్వర నిర్ణయాలు నేటి రాజగోపాల్ రెడ్డి విషయంలో ఎందుకు జాప్యం జరుగుతుంది? సురేఖ ఆరోపించినట్టు కాంగ్రెస్ లో రెడ్డి సామాజికవర్గం అసమ్మతికి ఒక న్యాయం బీసీ నేతల అసమ్మతికి మరో న్యాయమా?
మునుగోడు నియోజవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ తో పాటుగా జెడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సీఎం రేవంత్ టార్గెట్ గా విమర్శనాబాణాలు ఎక్కుపెడుతూనే వస్తున్నారు. అయినా కూడా రాష్ట్ర కాంగ్రెస్ కానీ కేంద్ర కాంగ్రెస్ కానీ నో కామెంట్స్ ధోరణిలోనే కాలం నెట్టుకెళ్తున్నారు వై?
Former India spinner Ravichandran Ashwin has strongly criticised Team India's decision to leave Mohammed Siraj…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు పాదయాత్రలు కొత్తేమి కాదు. నాటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 'యాత్ర' నుంచి నేటి నారా లోకేష్ 'యువగళం'…