
గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు అంతులేని హామీలతో ప్రజలను ఆకాశపు అంచులదాకా తీసుకువెళ్తున్నారు. ఆ హామీలన్నీ అమలు చేస్తే రాష్ట్ర ఖజానా పాతాళానికి వెళ్లాల్సిందే అనేది ప్రజలు కూడా గ్రహించాలి. ఈ రాజకీయ పార్టీ అధినేతల హామీలతో బాగు పడేదెవరు? బలయ్యేది ఎవరో? ఇప్పుడు తెలుసుకుందా!
తాజాగా తెలంగాణ ఎన్నికలలో ప్రధాన పార్టీలైన అధికార బిఆర్ఎస్, ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీల హామీలు ఒక్కసారి గమనిస్తే….,
బిఆర్ఎస్ హామీలలో కొన్ని:
. పేదలకి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు
. ఒక్కో దళిత కుటుంబానికి ఏడాదికి 12 లక్షల నగదు సాయం
. 400 కే గ్యాస్ సిలిండర్
. రైతు బందు 10 వేల నుండి 16 వేలకు పెంపు
. పెన్షన్ దశలవారీగా 5 వేలకు పెంపు
. 5 లక్షలతో కేసీఆర్ భీమా ప్రతి ఇంటికి ధీమా పతకం
. 18 సంవత్సరాలు దాటిన మహిళలకు నెలకు 3 వేలపెన్షన్ అమలు
. ఆరోగ్య శ్రీ గరిష్ట పరిమితిని 15 లక్షలకు పెంపు…వంటి పతకాలతో పార్టీ గెలుపుకి ప్రయత్నిస్తున్నారు అధికార బిఆర్ఎస్ అధినాయకత్వం.
కాంగ్రెస్ హామీలలో కొన్ని ముఖ్యమైనవి:
. 18 ఏళ్ళు నిండిన చదువుకునే ప్రతి యువతికి ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్
. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు బంగారు తల్లి పథకం పునరుద్ధరణ
. ఆస్తి పన్ను, ఇంటి పన్ను బకాయిల పెనాల్టీలు రద్దు
. రాష్ట్రంలో రేషన్ డీలర్ల గౌరవ వేతనం కింద 5 వేలు ఆర్థిక సాయం
. 500 లకే గ్యాస్ సిలిండర్
. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం
. మహాలక్ష్మి పతకం కింద మహిళలకు 2500 ఆర్థిక సాయం
. రైతు భరోసా 15 వేలకు పెంచుతూ కౌలు రైతులను ఇందులో భాగస్వాములుగా చేయడం
. వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12 వేల సాయం
. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల మేర ఉచిత విద్యుత్ హామీ
. ఇందిరమ్మ ఇళ్ల పునర్నిర్మాణం
. యువ వికాసం పేరుతో విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా…ఇలా ఎవరికీ తోచిన హామీలు వారి ఇచ్చుకుంటూ పార్టీ గెలుపే అంతిమ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు.
అయితే “మితిమీరిన ఆహారం ఆరోగ్యానికి ఎలా అయితే హానికరమో”.. అలాగే “మితిమీరిన సంక్షేమం కూడా రాష్ట్రానికి అంతే హానికరం”…అనేది అటు రాజకీయ పార్టీలు ఇటు రాష్ట్ర ప్రజలు మరిచిపోతున్నారు. సంక్షేమ పతాకాలతోనే ఓట్లు రాలుతున్నాయి కాబట్టి వాటికే రాజకీయ పార్టీలు సిద్దమవుతున్నాయని రాజకీయ నాయకులు.., కాదుకాదు రాజకీయ పార్టీలే తమకు సంక్షేమ పతకాలను ఎరగా వేసి ఓట్లు దండుకుంటున్నాయని ప్రజలు..ఇలా కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టు సమాధానం దొరకని ప్రశ్నలు వేసుకుంటూ “ఫ్రీ…ఫ్రీ పథకాలతో కాస్టలీ రాజకీయాలు చేస్తున్నారు”.
హామీలు ఆకాశాన్ని తాకితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పాతాళానికి చేరుకోవడానికి ఎంతో కాలం పట్టదు అనేది నేడు శ్రీలంక ఉదంతాన్ని చూసైనా నేర్చుకోలేకపోతున్నారు రాజకీయ పార్టీలు. పేదలకే సంక్షేమం అంటున్నారు కానీ సంక్షేమంతో పేదరికాన్ని సృష్టిస్తున్నారు అనే ఆలోచన ప్రజలకు కలగడం లేడు.ప్రతి ప్రభుత్వం పేదవాడి కోసమే పనిచేస్తే స్వతంత్ర భారత దేశానికి ఇన్నేళ్లు గడిచిన ఇంకా ఫ్రీ పతకాల అవసరం ఎందుకు మారలేదు? ఏడాదికేడాది సంక్షేమ పతకాలు తీసుకుంటున్న కుటుంబాల సంఖ్య పెరుగుతుంటే పేదరికం తగ్గినట్టా? పెరిగినట్టా? ఈ ప్రశ్న ఒక్క రాజకీయ పార్టీలకే కాదు ప్రజలకు కూడా వర్తిస్తుందనేది గ్రహించాలి.
Rajinikanth's Jailer 2 has taken a strong start at the global box office and is…
The TDP, Jana Sena and BJP have finalised their seat-sharing agreement for Andhra Pradesh’s urban…