ముగ్గురు రాజకీయ స్టార్ ప్లేయర్స్ ..రెండు నియోజకవర్గాలు!ఏపీలో కూడా సాధ్యమా?

ఈ సారి తెలంగాణ ఎన్నికలలో రసవత్తరమైన పోటీలు నెలకొన్నాయి. ముగ్గురు రాజకీయ స్టార్ ప్లేయర్స్ …రెండు నియోజకవర్గాలు.,వీటి మీదే తెలంగాణలోనే కాదు ఎవత్ తెలుగు ప్రజలందరి ద్రుష్టి కేంద్రీకృతమయ్యింది. అవే గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాలు. కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఈటెల రాజేంద్రప్రసాద్ వీరే ఆ స్టార్ పొలిటికల్ ప్లేయర్స్.

గజ్వేల్,కామారెడ్డిలో కేసీఆర్., కామారెడ్డి,కొడంగల్ లో రేవంత్ రెడ్డి.,గజ్వేల్,హుజురాబాద్ లో ఈటెల ఇలా ఒక్కొక్కరు రెండేసి నియోజక వర్గాలను ఎంచుకోవడం చూస్తుంటే ఈ సారి తెలంగాణలో ఎన్నికల పోటీ మాములుగా ఉండదనిపిస్తుంది. ముగ్గురు ఆయా పార్టీలకు ముఖ్యమంత్రి నేతలుగానే ప్రజలు పరిగణించడం, గెలుపు కోసం ముగ్గురు తమ శక్తి యుక్తులను దారపోయడం తప్పనిసరి.

ADVERTISEMENT

తానూ పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాలలో ఒకటి రేవంత్ మరొకటి ఈటెల కావడంతో
ఈ డబుల్ ధమాకాలో కేసీఆర్ కు అగ్నిపరీక్షే అవుతుంది.మొత్తానికి తెలంగాణ ఎన్నికలు ఓ ముల్టీస్టారర్ మూవీని తలదన్నేలా ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇదే తరహా పోటీ అటు ఏపీలో కూడా జరిగితే ఏపీ ప్రజలకు అవసరమైన అసలైన నాయకుడు ఎవరనేది నిర్దారించవచ్చు.

కొన్ని దశాబ్దాలుగా తమకు పట్టున్న స్థానాలు తప్ప వేరే ప్రాంతానికి వచ్చి పోటీ చేసి గెలిచే సాహసం ఈమధ్యకాలంలో ఒక్క లోకేష్ తప్ప మరెవ్వరు చేయలేదనే చెప్పాలి. ఏపీలో కూడా ముఖ్యమంత్రి అభ్యర్థులుగా చెప్పబడే ముగ్గురు నేతలు కూడా ఇలానే ఒకే స్థానంలో పోటీ చేసి గెలవగలిగితే ఆ విజయానికి వచ్చే కిక్కే వేరప్పా. రాష్ట్రమంతా తమ సంక్షేమ పథకాలతో సుభిక్షంగా వెలిగిపోయుంది అని చెప్పుకునే వైసీపీ నేతలు తమ అధినేతను ఏపీ రాష్ట్ర రాజధానిలో పోటీకి నిలబెట్టగలిగితే అసలు రాష్ట్రంలో పాలనాభివృద్ది అనేది జరిగిందా లేదా అనేది స్పష్టమయిపోతుంది.

అంటే అసలు ఏపీ కి రాజధాని ఉందా? అనే సందేహం కూడా లేకపోలేదనుకోండి.గత ప్రభుత్వం ఆమోదించిన ప్రాంతమైన అమరావతిలో కానీ ఇప్పుడు ప్రభుత్వం రాజధానిగా మార్చాలనుకుంటున్న విశాఖలో కానీ వైస్ జగన్, చంద్రబాబు ఒక ప్రాంతంలో.., వైస్ జగన్ పవన్ కళ్యాణ్ మరో ప్రాంతంలో పోటీ చేస్తే అప్పుడు ఉంటుంది అసలైన రాజకీయ చదరంగం. తెలంగాణలో సాధ్యమైన ఈ మల్టి స్టారర్ పొలిటికల్ ప్లేయర్స్ గేమ్ ఆంధ్రాలో కూడా జరిగితే పాల్గొనడానికి ఆసక్తిగా ఉన్నారు ఏపీ ప్రజలు. మరి అది సాధ్యమేనా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

IND vs WI 3rd T20I: India Win, But a Big Reality Check!

India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…

6 hours ago

Jailer 2 Bookings Explode: Rajini Mania Beats Weak Buzz?

Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…

8 hours ago