
తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులను చాలా గౌరవంగా చూసుకొంటోందని కానీ ఏపీలో జగన్ ప్రభుత్వం ఉద్యోగులను, ఉపాధ్యాయులను వేదిస్తోందన్నారు. ఉపాధ్యాయులు ‘ఛలో విజయవాడ’ ర్యాలీ నిర్వహించాలనుకొంటే వారిపై అక్రమ కేసులు బనాయించి, పోలీస్ స్టేషన్లలో నిర్బందించిందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయులను వేధిస్తుండటం నిజం కాదో తెలుసుకోవాలనుకొంటే అక్కడ మీ స్నేహితులతో మాట్లాడి తెలుసుకోవచ్చని అన్నారు.
ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయులకు నెలనెలా జీతాలు కూడా సకాలంలో చెల్లించడంలేదని మంత్రి హరీష్ రావు అన్నారు. ఏపీతో పోలిస్తే తెలంగాణలో ఉపాధ్యాయులకు జీతాలు ఎక్కువే చెల్లిస్తున్నామని అన్నారు. తమ ప్రభుత్వం గత ఐదేళ్ళలో ఉద్యోగులకు 73 శాతం ఫిట్ మెంట్ ఇచ్చిన సంగతిని మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు గుర్తు చేశారు.
ఏపీ ప్రభుత్వం అప్పుల కోసమని మోటర్లకు మీటర్లు బిగించేందుకు ఒప్పుకొని ఏడాదికి రూ.6,000 కోట్లు అప్పులు తెచ్చుకొంటోందని కానీ కేసీఆర్ మాత్రం రైతులకు నష్టం కలగకూడదని అందుకు అంగీకరించడం లేదని మంత్రి హరీష్ రావు అన్నారు. అందుకే రాష్ట్రానికి రావలసిన రూ.30 వేల కోట్లు రాకుండా కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిందని అన్నారు.
తమిళనాడు మొత్తం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న విజయ్ ప్రమాణ స్వీకారం కూడా పూర్తయింది. జోసెఫ్ విజయ్ అనే నేను అంటూ…
కాంగ్రెస్ పార్టీకి మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షుడు కావచ్చు. కానీ దేశంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, పార్టీ నేతలు అందరూ కూడా నేటికీ…