
బిఆర్ఎస్ పతనంతో తెలంగాణలో దొరల పాలన ముగిసిపోయింది ఇక ప్రజా పాలనే అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన నేడు ఫలితాలనిస్తుంది గమనించాలి అంటూ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
చట్టం ముందు సామాన్యుడైన, సెలబ్రెటీ అయినా, రాజకీయ ప్రముఖులైన ఒక్కటే అనే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళుతుందని, అందుకు నిదర్శనం నిన్న అల్లు అర్జున్ మీద పెట్టిన కేసు, ఆయన అరెస్టు…అలాగే నేడు కేసీఆర్ కుమారుడు మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ మీద నమోదైన కేసు ఆ తరువాత జరగబోయే పరిణామాలు అంటున్నారు కాంగ్రెస్ నేతలు.
2023 ఫిబ్రవరి 10 ,11 న హైద్రాబాద్ నక్లెస్ రోడ్డులో జరిగిన ఈ ఫార్ములా రేసింగ్ విషయంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కేటీఆర్ అక్రమాలకు పాల్పినట్టు ప్రభుత్వం ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ కేసుని ఏసీబీ కి అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం. దీనితో ఈ కేసు విచారణ చేపట్టిన ఎసిబి ఫార్ములా ఈ కార్ రేసు అంశంలో కేటీఆర్ ని A1 నిందితుడిగా చేర్చారు.
అలాగే AI గా ఉన్న కేటీఆర్ తో పాటుగా A2 గా ఐఏఎస్ అర్వింద్ కుమార్, A3 గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బిల్ఎన్ రెడ్డి పై కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది ఎసిబి. అయితే ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పై విచారణ జరపడానికి అధికారులు గవర్నర్ అనుమతి కూడా పొందారు.
తన మీద నమోదైన కేసుల విషయంలో అసెంబ్లీ వేదికగా స్పందించి కేటీఆర్…ప్రభుత్వానికి నిజంగా చిత్త శుద్ధి ఉంటే, ఈ కేసు తాలూకా అసలు వాస్తవాలు ప్రజల ముందు ఆవిష్కరించాలి అనుకుంటే ఈ అసెంబ్లీ సాక్షిగా నేను నా పార్టీ ఎటువంటి చర్చకైనా సిద్ధంగా ఉన్నాం అంటూ ప్రభుత్వానికి విజ్ఞపతి చేసారు.
ఫార్ములా ఈ రేసు కేసు విషయంలో కేటీఆర్ భారీ కుంభకోణానికి పాల్పడ్డాడు అంటూ వాదిస్తున్న కాంగ్రెస్ నేతలకు దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీ లో చర్చ రండి, ఈ విషయంలో మీకు ఉన్న అన్ని అనుమానాలకు అపోహలకు నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ కేటీఆర్ తన పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు.
అయితే ఎసిబి అధికారులు కేటీఆర్ ని A1 గా చేరుస్తూ కేసు నమోదు చేయడంతో అటు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఆందోళనలో ఉన్నారు. ఏ నిముషం ఏ జరుగుతుందో అన్న ఆలోచనలో బిఆర్ఎస్ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అయితే బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన తనయుడి మీద నమోదయిన కేసు పట్ల పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఇప్పటికి ఎటువంటి ప్రకటన చెయ్యలేదు.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…