
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తిరుమల వెంకన్న కేంద్రంగా ఇంత రాజకీయ రచ్చ జరుగుతుంటే దాని గురించి స్పందించేందుకు కూడా సుముఖత వ్యక్తం చెయ్యని తెలంగాణ రాజకీయ పార్టీలు ఆ ఏడుకొండల వాడి సన్నిధిలో తెలంగాణ భవన్ నిర్మాణానికి మాత్రం తమకు అనుమతులు ఇవ్వాలంటూ ప్రభుత్వానికి అభ్యర్ధనలు పెట్టుకుంటున్నారు.
తిరుమల పవిత్ర మీద చెరగని మచ్చ గా మారిన ఈ వివాదం, హిందువుల మనోభావాలను పట్టించుకోకుండా సాగుతున్న ఈ రాజకీయ చదరంగం, ఆ దేవదేవుని ప్రసాదం చుట్టూ జరుగుతున్న కల్తీ ప్రచారం పై కనీసం నోరు విప్పలేని సోకాల్డ్ నాయకుడు తిరుమల శ్రీవారి విఐపి టిక్కెట్ల కోటాలో తమ రాష్ట్ర నాయకులకు వాటా కావాలి అంటూ డిమాండ్లు చేసారు.
తెలంగాణ రాష్ట్ర హక్కుగా భావించి ఆ ఏడుకొండలవాడి దర్శనం కోసం, అక్కడ భవనాల నిర్మాణం కోసం తాపత్రయపడుతున్న ఆ కాంగ్రెస్ నేతల వినతులు, ఈ బిఆర్ఎస్ నాయకుల డిమాండ్లు కేవలం వారి స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసమేనా.?
హక్కుల కోసం అభ్యర్ధనలు చేసే తెలంగాణ రాజకీయ పార్టీలు, ఇది మా హక్కు అంటూ డిమాండ్లు ప్రకటిస్తున్న అక్కడి నాయకులు తమ బాధ్యతగా తిరుమల లడ్డు వివాదం పై ఎందుకు నోరు విప్పలేకపోతున్నాయి.? ఆ దేవదేవుని మీద వైసీపీ ఈ రకమైన రాజకీయం చేస్తున్నా, చివరికి ఆయనను చట్టసభల వరకు లాగినా ఏ ఒక్క తెలంగాణ నాయకుడు కూడా ఎందుకు స్పందించడం లేదు.?
ఎక్కడో అయోధ్యలో రామమందిరం నిర్మిస్తే దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతి హిందూ ఇంటిలో దీపాలు వెలిగించారు. మరి అటువంటపుడు తిరుమల వివాదం ప్రతి హిందూ సమస్య కాదా.? దీని పై స్పందించే బాధ్యత తెలంగాణ నాయకులకు లేదా.? దీన్ని తప్పించుకోవడమనాలా.? లేదా తప్పు కప్పిపుచ్చడమనాలా.?
ఒక పక్క సిట్ నివేదిక ప్రకారం లడ్డులో వాడిన నెయ్యి ఒక సింథటిక్ మిశ్రమం అని తేల్చినా, అలాగే NDDB రిపోర్ట్ ప్రకారం అందులో జంతు కొవ్వు కలిసింది అంటూ నివేదిక వచ్చినా ఇది కేవలం ఒక ఏపీకి సంబంధించిన దేవాలయ సమస్యగా తెలంగాణ నాయకులు గమ్మునుంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది కేవలం ఏపీ సమస్య అంటూ ఆ ఏడుకొండలవాడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితం చేసేవారు. ఇక పొద్దున్నలేస్తే ముహుర్తాలు, వారాలు, వర్జాలు, హోమాలు అంటూ ధార్మికతనకు ఎక్కువగా నమ్మే కేసీఆర్ సైతం హిందువులకు అత్యంత ప్రియమైన ఆ దేవదేవుని చుట్టూ ఈ రకమైన రచ్చ జరుగుతుంటే కనీసం దాని పై స్పందించడం లేదు.
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…