
పుష్ప-2లో పుష్పరాజ్ పోలీసులను, రాజకీయ నాయకులను కూడా గడగడలాడించాడు. కానీ నిజజీవితంలో రాజకీయ చదరంగంలో పావుగా మారి అనూహ్యంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.
అల్లు అర్జున్ మద్యంతర బెయిల్ని రద్దు చేయాలంటూ తెలంగాణ పోలీస్ శాఖ సుప్రీంకోర్టుకి వెళ్ళబోతోందని సమాచారం. సంధ్య థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నోటీస్ ఇచ్చారు. అంటే అల్లు అర్జున్ కేసు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎన్ని విమర్శలు, ఒత్తిళ్ళు ఎదురైనప్పటికీ, వెనకడుగు వేసే ఉద్దేశ్యం లేదని సంకేతం ఇచ్చిన్నట్లే భావించవచ్చు.
అల్లు అర్జున్ వద్ద బోలెడు డబ్బు ఉంది కనుక దేశంలో టాప్ లాయర్స్‌ని పెట్టుకొని కోర్టు కేసుని ఎదుర్కోగలరు. బహుశః ఆయన ప్రమేయం లేకుండానే న్యాయపోరాటం కొనసాగించగల శక్తి సామర్ధ్యాలు అల్లు అర్జున్‌కి ఉన్నాయి.
కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పార్టీలను హ్యాండిల్ చేయడమే ఆయన తలకు మించిన పనవుతుంది. కానీ ఆ దిశలో కూడా అల్లు అర్జున్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. సినీ ప్రముఖుల పరామర్శలు పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ చిరంజీవి, నాగబాబు ఇళ్ళకు వెళ్ళి కలిసివచ్చారు. పవన్ కళ్యాణ్‌ని కలిసేందుకు త్రివిక్రమ్ ద్వారా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ప్రభుత్వ పెద్దలతో సత్సంబంధాలున్న నిర్మాత దిల్ రాజు ద్వారా వారిని కూడా కలిసేందుకు అల్లు అర్జున్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
తనకు సంఘీభావం తెలుపుతూ జగన్ ట్వీట్ చేసినప్పటికీ అల్లు అర్జున్ స్పందించలేదు. జైలు నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకున్నారు కానీ జగన్‌కు చెప్పలేదు. అంటే ఇకపై మీకు, మీ పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పిన్నట్లే భావించవచ్చు.
ఈ అరెస్టుకి అసలు కారణం ఏమిటి?ఎవరు?అనే రెండు ప్రశ్నలకు సమాధానం అల్లు అర్జున్‌కి ఈ పాటికి తెలిసే ఉంటుంది. కనుక రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలను అల్లు అర్జున్ చక్కబెట్టుకోగలిగితే ఈ సమస్యల నుంచి బయటపడిన్నట్లే.
A film can have a weak trailer, little audience interest and still look like a…
After the 2024 Assembly election victory, TDP, Jana Sena and BJP are preparing for their…