
సమాజం విద్వేషంతో కలుషితం అయిపోతుందా.? అరాచకం తో కలిసి నడుస్తుందా.? ఒక మనిషి ప్రాణానికి విలువలేకుండా పోతుందా.? అన్నట్టుగా కొన్ని సంఘటనలు సమాజాన్ని తట్టి లేపుతున్నాయి.
ఇటీవల ఆగస్టు 18 న తెలంగాణలోని కూకట్ పల్లి లో జరిగిన 10 ఏళ్ళ బాలిక సహస్ర హత్య సంచలనంగా మారింది. విచక్షణారహితంగా జరిగిన ఈ దారుణ హత్యతో సహస్ర కుటుంబం తల్లడిల్లుతోంది. తమ కుటుంబానికి న్యాయం కావాలి, తమ బిడ్డ ఆత్మకు శాంతి కలగాలి అంటే ఆ కిరాతకుడిని ఎన్ కౌంటర్ చెయ్యాల్సిందే అంటూ సహస్ర కుటుంబం కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట నిరశన తెలుపుతున్నారు.
ఇక్కడ విచిత్ర ఏమిటిటంటే చనిపోయిన సహస్ర వయసు 10 ఏళ్ళు కాగా చంపిన హంతకుడి వయస్సు 14 ఏళ్ళు. ఇంత చిన్న వయసులో ఇంతటి దారుణానికి వడికట్టాడు అంటే సమాజంలో హింస ఎంత ప్రధాన పాత్ర పోషిస్తుందో అర్ధమవుతుంది.
10 ఏళ్ళ చిన్నారి మెడ పై 15 కత్తిపోట్లు, శరీరం పై 19 గాయాలు గుర్తించిన ఫోరెన్సిక్ అధికారులు చిన్నారి దారుణ హత్యకు విస్తుపోయారు. అలాగే సహస్రను చంపడానికి నిందితుడు చెప్పిన కారణాలు కూడా అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
నిందితుడు సహస్ర ఇంటిలోని క్రికెట్ బ్యాట్ దొంగతనానికి వెళ్లిన నేపథ్యంలో సహస్ర అతనిని చూడడంతో ఆమె పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి సహస్రను హతమార్చాడు. ముందుగానే ఒక పక్కా స్క్రిప్ట్ ప్రకారం దొంగతనానికి వచ్చినట్టు మిషన్ డన్ అంటూ రాసిన ఒక నోట్ కూడా కనిపించడంతో నిందితుడి లో హింసా ప్రవృత్తి ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది.
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…