
పాట యొక్క వీడియో చివరిలో, టైటిల్ కార్డులో, ‘ఏప్రిల్ 2020’ చూడవచ్చు. దీనిబట్టి ఏప్రిల్ విడుదలకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని ఊహాగానాలు ఉన్నాయి. ఇది ప్రస్తుతానికి ప్రణాళిక మాత్రమే, ఈ ప్లాన్స్ అన్నీ సాధారణ స్థితి ఎలా పునరుద్ధరించబడతాయి అనే దానిపై ఆధారపడి ఉంటుంది.
ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. అయితే సాధారణ పరిస్థితి వచ్చిన వెంటనే తెలుగులోనే చాలా చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఆ సమయంలో మాస్టర్ కు సోలో రిలీజ్ ఇవ్వడానికి వారు ఒప్పుకునే అవకాశం లేదు. దీనితో ఆ చిత్రానికి ఇబ్బంది అనే చెప్పుకోవాలి.
చాలా కాలం తెలుగులో మార్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న విజయ్ తన రీసెంట్ సినిమా విజిల్ తో కొంతమేర సఫలీకృతం అయ్యాడు. ఆ సినిమాకు మంచి ఓపెనింగ్ వచ్చింది. మాస్టర్ తో దానిని మరింత పెంచుకోవాలని విజయ్ అనుకున్నాడు. ఈలోగా కరోనా రక్కసి రూపంలో కొత్త ఇబ్బంది వచ్చి పడింది.
Following the back to back commercial success of Karuppu and Vishwanath and Sons, Suriya is…
The Andhra Pradesh State Election Commission (SEC) has rescheduled municipal elections in 99 urban local…