Telugu

హాట్ హాట్… మరో 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలు సిద్ధం..!

జంపింగ్ లకు సంబంధించి రాజకీయ వర్గాల్లో తాజాగా హల్చల్ చేస్తున్న సమాచారం ప్రతిపక్ష పార్టీ వైసీపీలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే వైసీపీ టికెట్ పై ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన 8 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి షాకిస్తూ టీడీపీలో చేరిపోగా, తాజాగా ఏపీ అసెంబ్లీలో ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ సహా మరో 9 మంది ఎమ్మెల్యేలు ‘సైకిల్’ ఎక్కేందుకు దాదాపుగా రంగం సిద్ధం చేసుకున్నట్లు మీడియా వర్గాల వేదికగా సందడి చేస్తున్న సమాచారం.

ఈ 10 మందిలో ఒక్క తూర్పు గోదావరి జిల్లా నుంచే జ్యోతుల నెహ్రూ సహా నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నట్లు పొలిటికల్ వర్గాల టాక్. ఇక మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఎవరన్న అంశంపై కూడా జోరుగా చర్చ సాగుతోంది. కాకినాడ వేదికగా మొదలైన ఈ ‘జంపింగ్’ వార్తలు మొత్తం రాష్ట్రంలోనే పెను చర్చకు దారి తీశాయి. ఇదే జరిగితే, వైసీపీ నుంచి ఏకంగా 18 మంది ఎమ్మెల్యేలు అధికార పక్షం టీడీపీలో చేరినట్టవుతుంది.

ADVERTISEMENT
Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

$22,000 Wasted? EB-2 Applicant Speaks Out

An EB-2 NIW applicant took to Reddit recently to warn others about SmartImmigrant.com. The company,…

2 hours ago

Salman Khan In Savage Mode: Beware Katrina Kaif Trolls?

Salman Khan is undoubtedly facing a tough phase at the box office. But he has…

2 hours ago