ఛి.. ఛి. ఇదేం పాడుపని థమన్ ?

thaman composing first single for sarkaru vari paataప్రస్తుతం వరుస బడా సినిమాలతో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకెళ్తున్న మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ట్విట్టర్ లో తన సినిమాలకు సంబంధించి ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటాడు. తాజాగా ‘సర్కారు వారి పాట’ సాంగ్ కంపోజిషన్ కి సంబంధించి కీ బోర్డ్ మీద రిథమ్స్ ప్లే చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాడు తమన్.

తమన్ తను కంపోజిషన్ సాంగ్ పెట్టడం ఆలస్యం దానికి ఒరిజినల్ సాంగ్ తీసుకొచ్చి కాపీ అంటూ ట్రోల్ చేస్తుంటారు నెటిజన్లు. అయితే ఈసారి మరీ దారుణంగా ఓ పోర్న్ సైట్ మ్యూజిక్ ని తమన్ వాడుకున్నాడనే పోస్ట్ ట్విట్టర్ లో ప్రత్యక్షమైంది. తాజాగా ‘సర్కారు వారి పాట’ సాంగ్ రెడీ అవుతుంది ముందుగా టెంప్లెట్స్ సెట్ చేస్తున్నా అంటూ తమన్ ఓ బిట్ మ్యూజిక్ పెట్టగానే దాన్ని రీట్వీట్ చేస్తూ ఇది పోర్న్ సైట్ మ్యూజిక్ లా ఉంది అంటూ ఓ ట్వీట్ పడింది. ఇక దాని కింద తమన్ ని టార్గెట్ చేస్తూ భారీ కామెంట్స్ వచ్చాయి. నిజానికి తమన్ కంపోజ్ చేస్తూ పెట్టిన వీడియోలో మ్యూజిక్ కి పోర్న్ సైట్ ఇంట్రో మ్యూజిక్ కి సింక్ కుదిరింది. కానీ అది యాదృచ్చికంగా జరిగిందో ఏమో కానీ నెటిజన్లు మాత్రం తమన్ ఇదేం పాడు పని అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

ADVERTISEMENT

ఇక తమన్ కంపోజ్ చేసిన సాంగ్స్ తో చిత్ర దర్శకుడు పరశురాం అన్ హ్యాపీ అంటూ ట్విట్టర్ లో కామెంట్స్ చేస్తున్నారు. దానికి తన దైన స్టైల్ లో పంచ్ ఇచ్చి ట్విట్టర్ వేదికగా వారికి కౌంటర్ ఇచ్చాడు తమన్. నిజానికి ఇది తమన్ కి ఎప్పుడూ. ఎప్పటికప్పుడు ట్రోలింగ్ చేసే నెటిజన్ల పై విరుచుకుపడుతుంటాడు తమన్. మరి ‘సర్కారు వారి పాట’ ఫస్ట్ సింగిల్ వచ్చాక తమన్ ఆ సాంగ్ తో ఎలా మెప్పిస్తాడో నెటిజన్లు ఎలా స్పందిస్తారో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories