
నిజాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి. కనుక ఆ నిజాలు చెప్పేవాడిని ఎవరూ ఇష్టపడరు. అందుకే పెద్దలు ‘యధార్ధవాది లోక విరోధి’ అని ఎప్పుడో చెప్పేశారు కూడా. సినీ పరిశ్రమలో అటువంటి వ్యక్తి తమ్మారెడ్డి భరద్వాజ. ఆయన సినీ పరిశ్రమకు సంబందించి ప్రతీ అంశంపై చాలా నిష్కర్షగా తన అభిప్రాయాలు చెపుతుంటారు. అందుకు అందరూ ఆయనని ద్వేషిస్తున్నా కూడా.
అల్లు అర్జున్ వ్యవహారం గురించి కూడా ఆయన చాలా విషయాలు చెప్పారు. అవన్నీ ఇప్పటికే అందరికీ తెలిసి ఉంటాయి కనుక ఇప్పుడు వాటి ప్రస్తావన అనవసరం. తాజాగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం గురించి కూడా మాట్లాడారు.
“ఇదంతా ఓకే ఒక్క వ్యక్తి (అల్లు అర్జున్) ఇగో వల్ల కలిగిన సమస్య. ఆయన ఇగో కారణంగా సినీ ప్రముఖులు అందరూ వెళ్ళి ముఖ్యమంత్రి ముందు తలదించుకోవలసి వచ్చింది. సంధ్య థియేటర్ వద్ద జరిగింది ఖచ్చితంగా తప్పే. కానీ ఆయనే మర్డర్ చేశారని నేను చెప్పడం లేదు. కానీ ఆయన రోడ్ షో చేయడం వలన తనకు తెలియకుండానే ఆ ఘటనకు బాధ్యుడు అయ్యారు.
ఈ తప్పు జరిగిందని తెలిసినప్పుడు ఆయన నిజాయితీగా వ్యవహరించి ఉండి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేదే కాదు. కానీ ఆ తప్పుని కవర్ చేసుకోవడానికి అబద్దాలు ఆడటంతో ఇండస్ట్రీ మొత్తంపై ఈ ప్రభావం పడింది.
ఇండస్ట్రీ అంతటికీ నష్టం జరిగింది. అందరూ వెళ్ళి ముఖ్యమంత్రి ముందు తలదించుకోవలసి వచ్చింది. దీనిని తలవంపులు అంటామో లేదా రాజీ చర్చలనుకుంటామో కానీ ఈ సమావేశానికి కారణం ఒక మనిషి ఇగో,” అని తమ్మారెడ్డి భరద్వాజ కుండబద్దలు కొట్టిన్నట్లు చెప్పారు.
సంధ్య థియేటర్ ముందు అల్లు అర్జున్ చేసింది రోడ్ షోనా కాదా అనేది పక్కన పెడితే దాంతోనే ఈ కధ మొదలైంది. ఆ తర్వాత అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌లో అభిమానులతో కలిసి పుష్ప-2 చూస్తున్నప్పుడు, బయట జరిగిన ఘటన గురించి పోలీసులు వచ్చి చెప్పారనే విషయం దాచిపెట్టి, మర్నాడు ఉదయం వరకు తనకు తెలీదని అబద్దం చెప్పారు.
కనుక తమ్మారెడ్డి భరద్వాజ చెప్పిన్నట్లు అల్లు అర్జున్ నిజాయితీగా వ్యవహరించి ఉంటే, సమస్య ఇంతవరకు వచ్చేదే కాదు. కానీ అల్లు అర్జున్ తన న్యాయవాదుల సలహాని పాటించి వారు చెప్పిన్నట్లే మాట్లాడం మంచిది అనుకున్నారు.
అటువంటి ఆందోళన కరమైన పరిస్థితి, సమయంలో ఎవరైనా అదే చేస్తారు. కానీ ప్రెస్‌మీట్ పెట్టి సిఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇవ్వాలనుకోవడమే తప్పు. ఆ తప్పుకి సినీ పరిశ్రమ ప్రభుత్వం ముందు తలదించుకోవలసి వచ్చింది కదా?
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…